Kaushik Reddy: బ్లాక్ బుక్ లో మీ పేర్లు ఎంటర్ చేస్తున్న.. అందరి తాట తీస్తా.. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వార్నింగ్..
Padi Kaushik Reddy: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ పై మండిపడ్డారు. అదే విధంగా కొందరు అధికారుల కోసం బ్లాక్ బుక్ లో చిట్టా రెడీగా ఉందని, దానిలో పేర్లు నమోదు చేస్తున్నామంటూ ధమ్కీ ఇచ్చారు.
Mla padi kaushik reddy fire on congress ministers and govt officials: ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల ప్రచారంలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి బరిలోకి దిగాయి. ప్రజలు కూటమికి బ్రహ్మరథం పట్టారు. ఇదిలా ఉండగా.. మెయిన్ గా ఏపీ టీడీపీ ఎన్నికల ప్రచారంలో.. రెడ్ బుక్ వ్యాఖ్యలు ఒక రేంజ్ లో వార్తలలో నిలిచింది. కొందరు అధికారులు కావాలని కూటమిని, వేధిస్తున్నాయని నాయకులు అప్పట్లో ఆరోపించారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లు, మెయిన్ గా అవీనితీకి పాల్పడుతున్న అధికారులు చిట్టాలను రెడ్ బుక్ లో నమోదు చేస్తున్నామంటూ అనేక సందర్భాలలో వ్యాఖ్యలు చేశారు. గవర్నమెంట్ ఉద్యోగులు ఏ పార్టీకీ కొమ్ముకాయకుండా.. తమ పరిధికి లోబడి పనులుచేయాలని కూడా అనేకమంది నేతలు తెలిపారు.
Read more: Viral video: అట్లుంటదీ మల్ల.. నరసింహ మూవీ స్టైల్ లో పాముకు కిస్ ఇచ్చిన తాత.. వీడియో వైరల్..
కానీ కొందరు మాత్రం.. గతంలో అత్యుత్సాహంతో కూటమిని వేధింపులకు గురిచేసినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే .. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏపీలో కొలువు దీరిన తర్వాత.. రెడ్ బుక్ లో ఉన్న అధికారులకు చుక్కలు చూపించడం స్టార్ట్ చేశారు. ఇక ఇదే ట్రెండ్ తెలంగాణలో కూడా స్టార్ట్ అయ్యిందని తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుంచి భారీగా కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు అధికారులు కూడా కాంగ్రెస్ పట్ల అత్యుత్సాహంతో , అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
కొందరు పోలీసులు, ఉన్నతాధికారులు తమను వేధిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ... తమను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వ అధికారుల పేర్లు.. బ్లాక్ బుక్ లో ఎక్కిస్తున్నానంటూ బాంబు పేల్చారు. కావాలనే వేధింపులకు గురిచేస్తున్న వారిని వదిలే ప్రసక్తి లేదని పాడికౌశిక్ రెడ్డి అన్నారు. తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఉంటుందంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు..బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అధికారులకు బ్లాక్ డేస్ ఉంటాయని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఇక.. ‘ ఫ్లై యాష్ రవాణాలో కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిన లీగల్ నోటీసులపై కూడా కౌశిక్ రెడ్డి స్పందించారు.
మీ లీగల్ నోటీసులకు.. లీగర్ గానే సమాధానం చెప్తుందన్నారు. ఫ్లై యాష్ రవాణాలో పొన్నం ప్రభాకర్ అక్రమాలకు పాల్పడకపోతే.. బుధవారం టీటీడీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రమాణానికి సిద్ధమా...? అంటూ సవాల్ విసిరారు. మరోవైపు.. బుధవారం రోజు పొన్నం ప్రభాకర్ రాకపోతే మరిన్ని ఆయన బండారాలు బైటపెడతానంటూ’’ అని సవాల్ విసిరారు. తన నియోజక వర్గంలో.. ఎమ్మెల్యేకు చెక్కులు ఇవ్వవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్డీవో, ఎమ్మార్వోలకు చెబుతున్నారని కౌశిక్ ఆరోపించారు.
Read more: Elephant Attacks On Mahout: మావటిని రెండుకాళ్లతో పిండి పిండి చేసిన ఏనుగు.. షాకింగ్ వీడియో వైరల్..
రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మూడు నెలల పింఛన్లను ఆపారని విమర్శించారు. వంద రోజుల్లో పింఛన్లు పెంపు వాగ్దానం ను రేవంత్ తప్పారని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజక వర్గాల్లో ప్రోటోకాల్స్ పాటించడం లేదని నిలదీశారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను తమకు తెలియకుండా పంపిణీ చేస్తున్నారన్నారు. చెక్కులను ఎమ్మెల్యేకు ఇవ్వవద్దని మంత్రి ఎమ్మార్వోలకు ఆదేశాలు ఇస్తున్నారన్నారు. అధికారులు ప్రోటోకాల్ ప్రకారం తమ విధులు నిర్వర్తించకపోతే హై కోర్టుకు వెళ్తానని కౌశిక్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి