Kaushik Reddy Yadadri Reels: తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి చుట్టూ తిరుగుతున్నట్టు కనిపిస్తున్నాయి. మొన్నటి దాక అరెకపూడి గాంధీ వర్సెస్‌ పాడి కౌశిక్‌ రెడ్డి వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా ఈ వ్యవహారం చక్కబడినట్టు కనిపించగా ఇది మరువకముందే పాడి కౌశిక్‌ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. తెలంగాణ ఇలవేల్పుగా ఉన్న యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామి ఆలయ క్షేత్రంలో రీల్స్‌ తీసుకున్నారనే వార్తలు హాట్‌ టాపిక్‌గా మారాయి. కౌశిక్‌ రెడ్డి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. తన సతీమణి, కుమార్తెతో కలిసి రీల్స్‌ చేసిన వీడియోలు ఆయన పంచుకోవడం వివాదానికి దారి తీశాయి. యాదాద్రి క్షేత్రంలో ఇలాంటి తప్పు అని భక్తుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. అసలు ఏం జరిగింది? అనేది తెలుసుకుందాం.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: KCR Astrology: మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారు రాసి పెట్టుకోండి.. జాతకం చెప్పిన ప్రముఖ జ్యోతిష్యుడు


హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి ఆదివారం ఎక్స్‌ వేదికగా ఓ పోస్టు చేశారు. తన సతీమణి శాలిని జన్మదినం సందర్భంగా పోస్టు చేసిన వీడియో వివాదానికి తెరలేపింది. ఆ వీడియోలో ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి తన సతీమణి శాలినితో కలిసి తిరుగుతున్నారు. ఆ వీడియో షూట్‌ చేసింది ఎక్కడో కాదు యాదాద్రి క్షేత్రంలో. యాదాద్రి ఆలయ పరిసరాల్లో వీరిద్దరూ తిరుగుతూ రీల్స్‌ రూపొందించుకున్నారు.

Also Read: Harish Rao: సెక్యూరిటీ లేకుండా రేవంత్‌ రెడ్డి వస్తానంటే.. నేనే కారు డ్రైవ్‌ చేస్తా


అంతేకాకుండా అక్టోబర్‌ 7వ తేదీన ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి కొన్ని ఫొటోలు, వీడియోలు పంచుకున్నారు. తన కుమార్తె శ్రీనిక జన్మదినం సందర్భంగా కౌశిక్‌ పంచుకున్న వీడియోలు, ఫొటోలు కూడా యాదాద్రి క్షేత్రం వద్ద తీసినవే. తన కుమార్తె యాదాద్రి ఆలయ ప్రాంగణంలో రీల్స్‌ చేయించారు. ఆలయ నగరిలో తిరుగుతూ తన కుమార్తె శ్రీనికతో కౌశిక్‌ రెడ్డి రీల్స్‌ చేయించారు. ఆలయ క్షేత్రంలో ఎమ్మెల్యే రీల్స్‌ చేయడం వివాదానికి దారి తీసింది.


వివాదాలకు కేంద్ర బిందువు
ఒక ఎమ్మెల్యేగా బాధ్యతాయుత పదవిలో ఉన్న కౌశిక్‌ రెడ్డి ఆలయ క్షేత్రంలో ఇలా రీల్స్‌ చేయడం సరికాదని చెబుతున్నారు. వాస్తవంగా ఆలయంలో రీల్స్‌, ఫొటోలు తీసుకోవడం నిషేధం. కానీ కౌశిక్‌ రెడ్డి ప్రత్యేకంగా రీల్స్‌ కోసం ఆలయాన్ని సందర్శించినట్లు తెలుస్తోంది. వాళ్లు రీల్స్‌ చేసేటప్పుడు భక్తులు ఎవరూ కనిపించకపోవడం గమనార్హం. ఈ రీల్స్‌ ఎప్పుడు తీశారనేది తెలియడం లేదు. ఆ దృశ్యాలు, ఫొటోలు చూస్తుంటే రీల్స్‌ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వివాదం రేపిన ఈ రీల్స్‌పై ఆలయ పాలక మండలి ఏమైనా స్పందిస్తుందా అనేది చూడాలి. కాగా ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి ఇటీవల తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజా వ్యవహారం అతడిని ఇబ్బందుల్లో పడేసే అవకాశం ఉంది.



 








స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి