MLA Raja Singh: పీడీ యాక్ట్ కింద జైలులో ఉన్న గోషాహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్  గురువారం పీడీయాక్ట్ అడ్వైజరీ బోర్డు ముందు హాజరుకానున్నారు. రాజా సింగ్ పై  పోలీసులు పెట్టిన పీడీ యాక్ట్ కేసు అడ్వయిజరీ బోర్డు ముందుకు వచ్చింది. ముగ్గురు రిటైర్డ్ జడ్జిలు, ఓ సామాజిక కార్యకర్తతో ఏర్పాటు చేసిన అడ్వయిజరీ బోర్డు కేసును పరిశీలించనుంది.  చట్టం ప్రకారమే పీడీ యాక్ట్ ను పెట్టారా లేదా అన్నది పరిశీలించనున్నారు. చర్లపల్లి జైలులో ఉన్న ఎమ్మెల్యే రాజాసింగ్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పీడీయాక్ట్ అడ్వైజరీ బోర్డు సభ్యులు ప్రశ్నించనున్నారు. ఈ కేసుకు సంబంధించిన పోలీసులు ఇచ్చిన డాక్యుమెంట్లను పరిశీలిస్తారు. పీడీయాక్ట్ అడ్వైజరీ బోర్డులో రాజాసింగ్ కు ఊరట లభిస్తుందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎమ్మెల్యే రాజాసింగ్ ను ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్  కింద మంగళహాట్ పోలీసులు ఆగస్టు 25వ తేదీన అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయన చర్లపల్లి జైలులో ఉన్నారు. పీడీ యాక్ట్ కు సంబధించి 32 పేజీల డ్యాక్యుమెంట్ ను పోలీసులు
రాజాసింగ్‌కు ఇచ్చారు. దేశవ్యాప్తంగా 101 కేసులు నమోదయ్యాయని.. మత ఘర్షణలకు దారి తీసేలా రాజాసింగ్ వ్యాఖ్యలు వున్నాయని అందులో తెలిపారు. మంగళ్‌హాట్, షాహినాయత్ గంజ్‌లో రాజాసింగ్‌పై రౌడీషీట్లు తెరిచారని వెల్లడించారు.  యూట్యూబ్ ఛానెల్ ద్వారా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో  పలు ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయని పోలీసులు చెప్పారు. వివాదాస్పద కామెంట్లు చేయవద్దని చాలా సార్లు హెచ్చరించినా పట్టించుకోలేదని పోలీసులు తెలిపారు. పదే పదే రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినందునే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు పోలీసులు.


మరోవైపు పీడీ యాక్ట్ ను రీవోక్ చేయాలని హైకోర్టులో రాజాసింగ్ కుటుంబ సభ్యులు పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగంలోని 14, 21 అధికారాలకు ఉల్లంఘిస్తూ ఆగస్టు 26 నుంచి రాజా సింగ్ ను అక్రమంగా నిర్బంధించారని తమ పిటిషన్ లో  రాజా సింగ్ భార్య ఆరోపించారు. కేసుల గురించి చెప్పకుండానే పీడీ యాక్ట్ కింద అరెస్టు చేయడం అన్యాయమన్నారు. రాజాసింగ్ కు బెయిల్ మంజూరు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని ఆమె కోరారు. ఈ పిటిషన్ విచారణకు తెలంగాణ హైకోర్టు నాలుగు వారాలకువాయిదా వేసింది.


Read also: Telangana Rain Alert: కుమ్మేస్తున్న వరుణుడు.. మరో మూడు రోజులు ఇంతే... జనాలకు ఐఎండీ వార్నింగ్


Read also:  Gold Silver Rates Today: భారీగా తగ్గిన వెండి... స్థిరంగా బంగారం ధరలు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి