Dhalita Bandhu: తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ సర్కార్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక సమయంలో దళిత బంధు స్కీంను ప్రకటించారు సీఎం కేసీఆర్. ఈ పథకం కింద దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల సాయం అందిస్తామని తెలిపారు. దేశంలో మరెక్కడ లేని విధంగా దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చామన్న గులాబీ బాస్.. ఇది చరిత్రాత్మక పథకమని అభివర్ణించారు. అంతేకాదు తెలంగాణలోని ప్రతి దళిత కుటుంబాన్ని ధనవంతులుగా మార్చడమే తమ సర్కార్ లక్ష్యమన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే కేసీఆర్ గొప్పగా చెప్పుకుంటున్న దళిత బంధు పథకం అమలులో గాడి తప్పిందని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పథకం అమలులో అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. అర్ఙులకు కాకుండా అధికార పార్టీ కార్యకర్తలు, ధనవంతులు, ఉద్యోగులకు కూడా ఇస్తున్నారని చెబుతున్నారు. దళిత బంధును బంధుప్రీతితో ఎమ్మెల్యేలు విమర్శల పాలు చేస్తున్నారనే టాక్ వస్తోంది. తాజాగా జనగామ జిల్లాలో దళిత బంధు పథకం అమలులో వెలుగుచూసిన నిజాలు విస్తుపోయేలా చేస్తున్నాయి.


స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో అసలైన లబ్ధిదారులను పక్కనపెట్టి ఎమ్మెల్యేల బంధువులు, స్థానిక ప్రజా ప్రతినిధులను లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. ఎమ్మెల్యే రాజయ్య తమ్ముడు తాటికొండ సురేష్ కుమార్ ప్రస్తుతం స్టేషన్ ఘనపూర్ సర్పంచ్ గా ఉన్నారు. ఆయన పేరు కూడా దళిత బంధు అర్హుల జాబితాలో ఉంది. అలాగే  రఘునాథపల్లి జడ్పీటీసి అజయ్ కుమార్ ను కూడా రైతు బంధు పథకానికి ఎంపిక చేశారు. మరికొందరు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, సింగిల్ విండో చైర్మన్ల పేర్లు దళిత బంధుకు తొలి జాబితాలోనే కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల ఒత్తిడితో అర్హుల పొట్టకొట్ట, ప్రజాప్రతినిధులు బంధు మిత్రులకు అధికారులు వత్తాసు పలుకుతున్నారే విమర్శలు వస్తున్నాయి.  దళిత బంధు అమలుపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.


Also read: Todays Gold Rate: బంగారం ధరలో తగ్గుదల, దేశంలో ఇవాళ్టి బంగారం ధరలు


Also read: Petrol Diesel Price Hike: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర ఎంతుందంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook