MLC Kavitha: మా సీఎం అభ్యర్థి కేసీఆర్.. మీ అభ్యర్థి ఎవరు..?: ఎమ్మెల్సీ కవిత సవాల్
MLC Kavitha Slams Congress and BJP: ఆర్మూర్ నుంచి ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని కోరారు ఎమ్మెల్సీ కవిత. ఆర్మూర్‌లోని పెర్కిట్ చౌరస్తాలో జరిగిన ర్యాలీలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
MLC Kavitha Slams Congress and BJP: బీఆర్ఎస్ సీఎం అభ్యర్థి కేసీఆర్ అని.. కాంగ్రెస్, బీజేపీ పార్టీల అభ్యర్థి ఎవరో చెప్పాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్ విసిరారు. రైతులకు 3 గంటలు మాత్రమే కరెంట్ చాలంటున్న కాంగ్రెస్ కావాలా..? లేదా 24 గంటల నిరంతర విద్యుత్ అందిస్తున్న సీఎం కేసీఆర్ కావాలా..? అని ఆలోచించుకోవాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్ల పెట్టమంటోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ కంపెనీలకు 15 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన బీజేపీ ప్రభుత్వం.. రైతు రుణమాఫీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్ఆరు. శుక్రవారం ఆర్మూర్‌లని పెర్కిట్ చౌరస్తాలో బీఆర్ఎస్ కార్యకర్తలను ఉద్ధేశించి ఆమె మాట్లాడారు.
ఆర్మూర్ నుంచి జీవన్ రెడ్డి మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని.. 60 వేల మెజారిటితో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు కవిత. గతేడాదిన్నర కాలం నుంచి జీవన్ రెడ్డి సీఎం కేసీఆర్‌తోనే ఉంటున్నారని.. నీడలాగా నిరంతరం సీఎంతో కలిసి పనిచేస్తున్నారని చెప్పారు. ఆకుల లలితకు భవిష్యత్‌లో అవకాశాలు వస్తాయన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతోపాటు ఆలూరు, డొంకేశ్వర్‌ను మండల కేంద్రంగా చేశామని చెప్పారు. ఆర్మూర్‌ను రెవెన్యూ డివిజన్ చేసుకున్నామన్నారు.
కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని.. రేవంత్ రెడ్డి వ్యవసాయానికి కేవలం 3 గంటల విద్యుత్ సరిపోతుందని అంటున్నారని కవిత అన్నారు. వ్యవసాయానికి 3 గంటల కరెంట్ సరిపోతుందా..? అని ప్రశ్నించారు. మరోవైపు బీజేపీ వాళ్లేమో మోటార్లకు మీటర్లను పెట్టమంటున్నారని విమర్శించారు. రూ.15 లక్షల కోట్ల మేర కార్పొరేట్ కంపెనీలకు రుణాలను మాఫీ చేసిన కేంద్రం.. రైతులకు ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేదని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మనకు దోస్తుకాదని.. ప్రజలతో కొనసాగే ఒకఒకే వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు. 2014లో తమకు 63 సీట్లు ఇచ్చారని.. 2019లో 88 సీట్లు ఇచ్చారని.. ఈసారి కచ్చితంగా 100కుపైగా ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
ఎర్రజొన్నలకు సంబంధించి 2007లో రైతులకు మోసం జరిగితే ధర్నా చేస్తున్న రైతుల మీద అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాల్పులు జరిపిందని కవిత అన్నారు. అప్పుడు ఎర్రజొన్న రైతుల కోసం జీవన్ రెడ్డి 9 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారని అన్నారు. కేసీఆర్ వచ్చి దీక్షను విరమించజేశారని గుర్తు చేశారు. రైతుల పక్షాన నిలబడ్డ జీవన్ రెడ్డి కావాలా.. ఇతర పార్టీలు కావాలా అన్నది రైతులు ఆలోచించాలని కోరారు.
Also Read: Virat Kohli: బీసీసీఐకి కోపం తెప్పించిన కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్.. ఆటగాళ్లందరికీ వార్నింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook