MLC Kavitha On Governor Tamilisai Soundararajan: రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. జాతిని ఉద్దేశించి రాష్ట్రానికి శుభసూచకంగా మాట్లాడిల్సిందిపోయి.. విమర్శలు గుప్పించడం సరికాదని అంటున్నారు. ఫాంహౌసులు కొందరికి మాత్రమే కాదని.. అందరికి ఫార్మ్‌లు కావాలంటూ గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆమె ఇండైరెక్ట్‌గా కౌంటర్ ఇచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'కరోనా లాంటి క్లిష్ట సమయంలో సెంట్రల్ విస్టా మీద కంటే.. దేశ మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కేవలం కొందరి సంపద పెంపుపై మాత్రమే దృష్టి పెట్టకుండా.. రైతులు, కూలీలు, నిరుద్యోగ యువతను పట్టించుకోవడం కోసమే మేము పోరాడుతున్నాం.. ఇలాంటి ప్రత్యేకమైన రోజున సీఎం కేసీఆర్ గారు ప్రశ్నిస్తున్న వాటినే మళ్లీ అడిగినందుకు గవర్నర్ గారికి ధన్యవాదాలు..' అంటూ రాసుకొచ్చారు. 


అంతుకుముందు రాజ్ భవన్‌లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొంతమందికి నేను నచ్చకపోవచ్చు. కానీ తెలంగాణ మాత్రం అన్ని రంగాల్లో దూసుకుతుంది. రాష్ట్రానికి విశిష్టమైన చరిత్ర ఉంది. అభివృద్ధి అంటే భవనాల నిర్మాణం కాదు.. జాతి నిర్మాణం. చరిత్రకు సాక్ష్యాలైన పాత భవనాలను కూల్చి కొత్త భవనలాను నిర్మించడం అభివృద్ధి కాదు..' అంటూ సీఎం కేసీఆర్‌పై పరోక్షంగా విమర్శలు చేశారు.  




రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని.. తెలంగాణ గౌరవాన్ని నిలబెడదామన్నారు గవర్నర్. తెలంగాణ అభ్యున్నతిలో తన పాత్ర తప్పకుండా ఉంటుందన్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ జాతీయ జెండాను ఎగురవేయగా.. ఈ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎస్ శాంతకుమారి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజలకు గవర్నర్ తమిళిసై రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. 


Also Read: President Droupadi Murmu Speech: గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.. జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం


Also Read: Keeravani Honoured with Padma : కొంచెం గ్యాప్ ఇవ్వమ్మా.. కీరవాణికి అవార్డుల వర్షంపై రాజమౌళి ట్వీట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి