బంగారం దోచుకెళ్లిన కోతులు
ఇంట్లోకి కోతి చొరబడిదంటే అంతే సంగతులు. అవి ఇళ్లంతా చిందర వందర చేసేస్తాయి. అంతేకాదు.. తిండి కోసం అన్ని గిన్నెలు పడేస్తాయి. కానీ బంగారం ఎత్తుకెళ్లిన సంఘటన గురించి ఎప్పుడైనా విన్నారా.
ఇంట్లోకి కోతి చొరబడిదంటే అంతే సంగతులు. అవి ఇళ్లంతా చిందర వందర చేసేస్తాయి. అంతేకాదు.. తిండి కోసం అన్ని గిన్నెలు పడేస్తాయి. కానీ బంగారం ఎత్తుకెళ్లిన సంఘటన గురించి ఎప్పుడైనా విన్నారా.
ఇదో విచిత్ర సంఘటన. కుమరం భీమ్ జిల్లాలో జరిగింది. ఇంట్లో దూరిన కోతులు..బంగారం ఎత్తుకెళ్లాయి. కుమురంభీం జిల్లా రెబ్బెన మండలంలో... ఓ ఇంట్లోకి కోతులు చొరబడ్డాయి. వంటగదిలో ఉన్న సామాన్లు అన్నీ చిందర వందర చేశాయి. పప్పు డబ్బాలు ఎత్తుకెళ్లాయి. ఐతే వాటిలో ఇంటి యజమాని తల్లికి చెందిన రెండు తులాల బంగారు గొలుసు, కూతురుకు చెందిన బంగారం చైన్ ఉన్నాయి.
కోతులు ఎత్తుకెళ్లిన పప్పు డబ్బాల కోసం వాటిని చాలా దూరం వరకు గ్రామస్తులు తరిమారు. కానీ అవి పప్పు డబ్బాలు ఎక్కడ పెట్టాయో కనిపించలేదు. వాటిలో ఉన్న గొలుసులు కూడా దొరకలేదు. దీంతో ఇంటి యజమాని లబోదిబోమంటున్నాడు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..