MoS Kishan Reddy Visits Flooded Places In Hyderabad: హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ (Hyderabad Rains) పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. చాలా ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే మునిగిఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వరదలతో హైదరాబాద్ నగరం భారీగా నష్టపోయింది. వరదల కారణంగా హైదరాబాద్ పరిసరాల్లో ఇప్పటివరకు 20 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వందలాది వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"194996","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"కిషన్ రెడ్డి","field_file_image_title_text[und][0][value]":"కిషన్ రెడ్డి"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"కిషన్ రెడ్డి","field_file_image_title_text[und][0][value]":"కిషన్ రెడ్డి"}},"link_text":false,"attributes":{"alt":"కిషన్ రెడ్డి","title":"కిషన్ రెడ్డి","class":"media-element file-default","data-delta":"1"}}]]


మరో రెండురోజులపాటు వర్షాలు ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ.. ఇళ్లల్లోనే ఉండాలని ప్రభుత్వం (Telangana Govt) హెచ్చరిస్తూ.. అత్యవసర నెంబర్లను సైతం జారీ చేసింది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో వరదల్లో మునిగిపోయిన లోతట్టు ప్రాంతాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి (G Kishan Reddy) బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి పలు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ.. అక్కడి పరిస్థితులు, ఇబ్బందుల గురించి ప్రజలతో మాట్లాడారు. 


[[{"fid":"194997","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"కిషన్ రెడ్డి","field_file_image_title_text[und][0][value]":"కిషన్ రెడ్డి"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"కిషన్ రెడ్డి","field_file_image_title_text[und][0][value]":"కిషన్ రెడ్డి"}},"link_text":false,"attributes":{"alt":"కిషన్ రెడ్డి","title":"కిషన్ రెడ్డి","class":"media-element file-default","data-delta":"2"}}]]


రాబోయే రోజుల్లో భారీ వర్షలు ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని విజ్ఞప్తి కిషన్ రెడ్డి సూచించారు. అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావద్దొంటూ ఆయన కోరారు. నిరంతరం ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, ఆర్మీ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. హైదరాబాద్‌లో గత 40 ఏళ్లలో ఇలాంటి ఘోర పరిస్థితిని చూడలేదని ఆయన అభిప్రాయపడ్డారు. Also read: Hyderabad Rains: 15కు చేరిన మరణాల సంఖ్య.. కొనసాగుతున్న రెస్క్యూ


[[{"fid":"194998","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"కిషన్ రెడ్డి","field_file_image_title_text[und][0][value]":"కిషన్ రెడ్డి"},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"కిషన్ రెడ్డి","field_file_image_title_text[und][0][value]":"కిషన్ రెడ్డి"}},"link_text":false,"attributes":{"alt":"కిషన్ రెడ్డి","title":"కిషన్ రెడ్డి","class":"media-element file-default","data-delta":"3"}}]]


ముంపు ప్రాంతాల ప్రజలు ప్రాథమిక సౌకర్యాల కొరతతో చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఈ ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సాయం చేయడానికి సిద్ధంగా ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.  Also read: Hyderabad Rains: నగరంలో ఎటుచూసినా నీరే.. హెల్ప్ లైన్ నెంబర్ల జారీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe