TS News: తెలంగాణలోని జగిత్యాల జిల్లా(jagtial District) మెట్‌పల్లి మండలంలోని ఆత్మనగర్​లో విషాదం చోటుచేసుకుంది. ఆత్మనగర్​లో కాల్వలో దూకి తల్లీకూతురు ఆత్మహత్య(Suicide)కు పాల్పడ్డారు. గ్రామానికి చెందిన వనజ(28).. తన కుమార్తె శాన్వి(6)ని తీసుకుని శనివారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటికి వెళ్లింది. అర్ధరాత్రి వరకు తిరిగి రాకపోవటంతో.... కుటుంబసభ్యులు చుట్టపక్కల ప్రాంతాల్లో గాలించారు. అయినా ఆచూకీ లభించలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: రంగారెడ్డి జిల్లాలో నాలుగేళ్ల బాలుడిని కిరాతకంగా చంపిన బాబాయి


ఈ ఉదయం గ్రామశివారులోని వరదకాల్వ(Canal)లో వీరి మృతదేహాలను గ్రామస్థులు గుర్తించారు. పోలీసుల(Police)కు సమాచారం అందించగా.. ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను బయటికి తీశారు. ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. కుటుంబ కలహాలే వీరి ఆత్మహత్యకు కారణమని స్థానికులు చెబుతున్నారు. తల్లీకుమార్తె మృతితో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook