Motkupalli Narsimhulu: దళిత బంధు పథకం కమిటీ చైర్మన్‌గా మోత్కుపల్లి నర్సింహులు ?
Motkupalli Narsimhulu as Dalita bandhu chairman: హైదరాబాద్: మోత్కుపల్లి నర్సింహులు త్వరలోనే దళిత బంధు చైర్మన్‌గా పగ్గాలు చేపట్టనున్నారా అంటే అవుననే ప్రచారం బలంగా వినిపిస్తోంది. మోత్కుపల్లి నర్సింహులు మరో మూడు లేదా నాలుగు రోజుల్లో టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారని, ఆ తర్వాత మోత్కుపల్లికి దళిత బంధు కమిటీకి (Dalita Bandhu) చైర్మన్‌గా నియమిస్తూ సీఎం కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉందనేది ఆ ప్రచారం సారాంశం.
Motkupalli Narsimhulu as Dalita bandhu chairman : హైదరాబాద్: మోత్కుపల్లి నర్సింహులు త్వరలోనే దళిత బంధు చైర్మన్‌గా పగ్గాలు చేపట్టనున్నారా అంటే అవుననే ప్రచారం బలంగా వినిపిస్తోంది. మోత్కుపల్లి నర్సింహులు మరో మూడు లేదా నాలుగు రోజుల్లో టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారని, ఆ తర్వాత మోత్కుపల్లికి దళిత బంధు కమిటీకి (Dalita Bandhu) చైర్మన్‌గా నియమిస్తూ సీఎం కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉందనేది ఆ ప్రచారం సారాంశం. ఈ మేరకు మోత్కుపల్లి నర్సింహులుకు కూడా సీఎం కేసీఆర్ నుండి ఒక స్పష్టమైన హామీ లభించిందని, ఆ హామీతోనే ఆయన టీఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారని రాజకీయవర్గాల్లో ప్రచారం నడుస్తోంది.
మోత్కుపల్లి నర్సింహులు నర్సింహులు దళిత బంధు చైర్మన్ (Motkupalli Narsimhulu as Dalita bandhu chairman) అయ్యే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం ఇవాళ కొత్తది కాకపోయినా.. ఇవాళే మరోసారి ఈ అంశం తెరపైకి రావడానికి కారణాలు లేకపోలేదు. నేడు సీఎం కేసీఆర్ ఉదయం అసెంబ్లీకి వచ్చేటప్పుడే మోత్కుపల్లి నర్సింహులును స్వయంగా తానే వెంటబెట్టుకొచ్చారని.. నేడు రోజు అంతా ఆయన సీఎం కేసీఆర్‌తోనే (CM KCR) అసెంబ్లీలోనే ఉండటాన్నిబట్టి చూస్తే ఆ రోజు త్వరలోనే రానుందనే టాక్ బలంగా వినిపిస్తోంది.
జులై 23న బీజేపికి రాజీనామా చేసిన మోత్కుపల్లి నర్సింహులు (Motkupalli Narsimhulu) అప్పటి నుంచి బీజేపీ వైఖరిపై, హుజూరాబాద్ బీజేపి అభ్యర్థి ఈటల రాజేందర్‌పై (Eetala Rajender) సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అదే క్రమంలో టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంను సమర్థిస్తూ ఆ పార్టీకి అనుకూలంగా ఉంటూ వస్తున్నారు. అప్పటి నుంచే ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరడం (Motkupalli Narsimhulu to join TRS) ఖాయం అనే టాక్ వినిపించింది.