Bandi Sanjay Speech at Sircilla BJP Rally: ‘‘ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ 50 లక్షల సొమ్ముతో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి నాపై పోటీ చేస్తాడా? అని కేసీఆర్ అంటున్నడు. ఎంపీ టిక్కెట్లు అమ్ముకున్న సన్నాసి కేసీఆర్ నాపై పోటీ చేస్తాడా? అని రేవంత్ రెడ్డి అంటున్నడు.. దీనిని బట్టి మీరే అర్ధం చేసుకోండి. కాంగ్రెస్, బీఆర్ఎస్ సీఎం అభ్యర్థులు ఎంత అవినీతిపరులో... అదే బీజేపీకి అవకాశమిస్తే ఏ అవినీతి ఆరోపణల్లేని పేద నాయకుడు సీఎం అవుతారు. ప్రజలంతా ఆలోచించుకుని బీజేపీకి ఓటేయాలని కోరుతున్నా’’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రజలకు విజ్ఝప్తి చేశారు. సిరిసిల్ల బీజేపీ అభ్యర్ధిగా రాణిరుద్రమదేవి నామినేషన్ వేసిన అనంతరం నిర్వహించిన ర్యాలీలో బండి సంజయ్ పాల్గొన్నారు.  
 
"ఇక్కడున్న షాడో సీఎం సిరిసిల్లను మస్త్ డెవలెప్ చేసినని గొప్పలు చెప్పుకుంటున్నడు. పట్టుమని పది చినుకులు పడితే సిరిసిల్ల మునిగిపోతోంది. కలెక్టర్ మునిగిపోతోంది. వీళ్ల సక్కదనం ఎట్లుందో దీన్ని బట్టి అర్ధం కావడం లేదా..? వీళ్లా అభివృద్ధి గురించి మాట్లాడేది..? కమీషన్లు, కాంట్రాక్టులు దొబ్బడంలో వీళ్లను మించినోళ్లు లేరు.. సిరిసిల్ల కొత్తచెరువును ఆధునీకరణ పేరిట సగం వరకు పూడ్చి వేసి శాంతినగర్, శ్రీనగర్ కాలనీ, సంజీవయ్య నగర్, అనంత్ నగర్ సర్దార్ నగర్ లను వరదలో ముంచుతున్నడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీకో విషయం చెప్పాలే.. కేసీఆర్ పాలనలో కొడుకు షాడో సీఎం అయితే ఇక్కడేమో సామంత రాజుల పాలన సాగుతోంది.. మండలానికి ఇద్దరు ముగ్గురు సామంత రాజులను నియోజకవర్గాన్ని దోచుకుంటున్నడు. పోలీసులు సైతం ప్రశ్నించే బీజేపీ నాయకులపై దాడులు చేస్తే కేసులు పెడుతున్నడు. ఇదేదో వాళ్ల సామ్రాజ్యమైనట్లు. పోలీసులు ఇట్లనే చేస్తే సిరిసిల్లకు వచ్చి ఇక్కడే కూర్చుంటా. ఏమనుకుంటున్నరో.. సిరిసిల్ల సెస్ ఎన్నికల్లో దమ్ము చూపిన కార్యకర్తలకు హ్యాట్సాఫ్. బీజేపీ ప్రజల్లో గుండెల్లో ఉంది. 


తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది. రాక్షస పాలన కొనసాగిస్తోంది. తెలంగాణ ప్రజలకు విముక్తి చేయాలని బీజేపీ జాతీయ నాయకత్వం ఆదేశించింది. అందుకే 50 లక్షల మంది నిరుద్యోగుల పక్షాన యుద్దం చేసిన. జైలుకు పోయిన. 40 లక్షల మంది రైతుల పక్షాన ఉద్యమించి లాఠీదెబ్బలు తిన్న. జీతాలు రాక 317 జీవోవల్ల నష్టపోయిన ఉద్యోగుల పక్షాన యుద్దం చేసి జైలుకు పోయిన. రైతుల పక్షాన ఉద్యమించి రక్తం చిందించిన. 


కేటీఆర్.. నువ్వే సీఎం అనుకుంటున్నవ్ కదా.. నీకు దమ్ముంటే మీ అయ్య నిన్ను సీఎంగా ప్రకటించమను. నువ్వు కాబోయే సీఎం అంటున్నవ్ కదా... సిరిసిల్లలో ఎంత మందికి ఉద్యోగాలిచ్చినవ్? ఎంత మందికి నిరుద్యోగ భ్రుతి ఇచ్చినవ్. ఎంత మంది లక్ష రూపాయల రుణమాఫీ చేసినవ్? సమాధానం చెప్పాలి. నువ్వు చేసిందేమీ లేదు. నువ్వు సీఎం కొడుకువి కాకుంటే నిన్ను కుక్కలు కూడా దేఖవు. బిచ్చపు బతుకు నీది. 


బీసీని ముఖ్యమంత్రిని చేస్తే బీఆర్ఎస్ ఓర్వలేకపోతోంది. కులం కంటే గుణం ముఖ్యమని కేసీఆర్ అంటూ అవమానిస్తున్నడు. అంటే బీసీలకు గుణం ఉండదా? వాళ్లు సీఎం పనికిరారా? సిగ్గులేకుండా బీసీలను అవమానిస్తారా? బీసీ సీఎం అయితే పేద, బడుగు, బలహీనవర్గాల జీవితాల బాగుపడుతాయి.


సిరిసిల్లలో రాణిరుద్రమను చూస్తే కేటీఆర్ కు వణుకు పుడుతోంది. ఈసారి ఆమె గెలుపు ఖాయం. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టడం తథ్యం. ఎందుకంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో మాదిరిగానే సిరిసిల్లలో సైలెంట్ ఓటింగ్ నడుస్తోంది. ఆమెను మంచి మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించాలని కోరుతున్నా.." అని బండి సంజయ్ కోరారు.


Also Read: Redmi 13C Price: అదిరిపోయే ఫీచర్స్‌తో డెడ్‌ చీప్‌ ధరతో మార్కెట్‌లోకి Redmi 13C మొబైల్‌..స్పెసిఫికేషన్స్‌ ఇవే..  


Also Read: Best Sound Bar: సాంసంగ్‌ సౌండ్‌ బార్‌పై రూ.3000 తక్షణ డిస్కౌంట్‌..ఫీచర్స్‌, ధర వివరాలు ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook