Minister Harish Rao About CM KCR: ఎన్నికలు రాగానే పార్టీలు నోటికొచ్చిన వాగ్ధానాలు చేస్తాయని.. నినాదాలు ఇచ్చేవి కొన్ని పార్టీలు అయితే నినాదాలు నిజం చేసే పార్టీ బీఆర్ఎస్ అని మంత్రి హరీష్ రావు అన్నారు. నకిలీ మాటలు.. వెకిలి చేష్టలు చేసే పార్టీలు ఎక్కువయ్యాయని ఫైర్ అయ్యారు. ఎమ్మార్పీఎస్ నాయకుడు యాతాకుల భాస్కర్ బీఆర్ఎస్‌లో చేరారు. భాస్కర్ సేవలను బీఆర్‌ఎస్ తప్పకుండా ఉపయోగించుకుంటుందని హరీశ్ రావు అన్నారు. దళితజాతి అభివృద్ధి కోసం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు భాస్కర్‌ను ఆకట్టుకున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా అమిత్ షాపై విమర్శలు గుప్పించారు. అమిత్ షాకు తెలంగాణపై అవగాహన లేదని.. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివి పోయారని అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమిత్ షా గుజరాత్ గుడ్డి పాలనను సరిచేసుకోవాలని హితవు పలికారు హరీశ్‌ రావు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత రాష్ట్రం కర్ణాటకలో హామీలు అమలు కావడం లేదని.. కర్ణాటకలో బీజేపీపై ప్రజలకు కక్కోస్తే కాంగ్రెస్ గెలిచిందన్నారు. "బీఆర్ఎస్ స్లోగన్స్‌ సర్కార్ కాదు.. సొల్యూషన్ సర్కార్.." అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. అంబేడ్కర్ ఓవర్ సిస్ స్కాలర్‌షిప్ కింద దళితులకు 20 లక్షలు కేసీఆర్ సర్కార్ ఇస్తోందన్నారు.


రెసిడెన్షియల్ స్కూల్స్, 80కి పైగా మహిళా డిగ్రీ కాలేజీలు పెట్టారని.. 1200 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు, 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని పెట్టిన ఏకైక సర్కార్ కేసీఆర్‌ది అని చెప్పుకొచ్చారు. పార్లమెంట్‌కు అంబేడ్కర్ పేరు పెట్టమంటే కేంద్ర ప్రభుత్వం మొఖం చాటేసిందని.. సెక్రటేరియట్‌కు అంబేడ్కర్  పేరు పెట్టి  ఆయనపై కేసీఆర్ సర్కార్ భక్తిని చాటుకుందన్నారు. తమ ప్రభుత్వం అంబేడ్కర్ మార్గంలో నడుస్తోందన్నారు. గిరిజనుల గురించి మాట్లాడే హక్కు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు లేదని అన్నారు.ఈ రెండు పార్టీలను తెలంగాణ జాతి నమ్మదన్నారు. ఈ పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలు మత కలహాలు, కరెంట్, నీళ్ల కష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయని పేర్కొన్నారు. మూడోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలు సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకున్నారని అన్నారు.


Also Read: Raksha Bandhan Wishes 2023: రాఖీ శుభాకాంక్షలు ఇలా ప్రత్యేక ఫోటోస్, కోట్స్‌తో తెలియజేయండి..   


Also Read: Aditya-L1 Mission Rehearsals: ఆదిత్య L1 ప్రయోగం రాకెట్ చెకింగ్, రిహార్సల్స్ పూర్తి


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook