Telangana Municipal Elections 2021: తెలంగాణలో మరో ఎన్నికల నగారాకు తెరలేచింది. ఓ వైపు నాగార్జున సాగర్ ఉపఎన్నిక జరుగుతుండగానే..మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలో 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో మళ్లీ ఎన్నికల నగారా మోగింది. దుబ్బాక ఉపఎన్నిక (Dubbaka Bypoll) నుంచి ప్రారంభమైన ఎన్నికల హోరు కొనసాగుతూనే ఉంది.దుబ్బాక ఉపఎన్నిక అనంతరం జీహెచ్ఎంసీ ఎన్నికలు(Ghmc Elections)వాడివేడిగా కొనసాగాయి. అనంతరం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మరింత రసవత్తరంగా సాగాయి. ఇప్పుడు నాగార్జునసాగర్ ఉపఎన్నిక(Nagarjuna sagar Bypoll) ఏప్రిల్ 17న జరగనుంది. ఈ తరుణంలో మరో ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలో 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్( Municipal Elections notification) విడుదలైంది. 


రాష్ట్రంలో వరంగల్(Warangal), ఖమ్మం(Khammam) కార్పొరేషన్లు, అచ్చంపేట, సిద్దిపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన రేపటి నుంచి అంటే ఏప్రిల్ 16 నుంచి 18 వ తేద వరకూ నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఈ నెల 22 వ తేదీ నామినేషన్ల ఉపసంహరణ జరగనుంది. ఏప్రిల్ 30 న పోలింగ్ జరగనుంది. మే 3న అంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజున మున్సిపాలిటీ, కార్పొరేషన్ల ఫలితాలు వెలువడనున్నాయి.


నామినేషన్ల స్వీకరణ...ఏప్రిల్ 16 నుంచి 18 వరకూ


నామినేషన్ల ఉపసంహరణ..ఏప్రిల్ 22


పోలింగ్ తేదీ...ఏప్రిల్ 30


కౌంటింగ్...మే 3వ తేదీ


Also read: Night Curfew: నైట్ కర్ఫ్యూ విధించే దిశగా తెలంగాణ ప్రభుత్వం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook