హైదరాబాద్‌ : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి తారా స్థాయికి చేరుకుంది. పోలింగుకు ఇంకా నాలుగు రోజులే ఉండటంతో అన్నీ ప్రధాన పార్టీలు తమ ప్రచారాలన్నీ ఉదృతం చేశాయి. ఇందులో భాగంగా శనివారం కామారెడ్డిలో మజ్లీస్ నేత ఎంపీ అసదుద్దిన్‌ ఓవైసి మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను చిత్తు చిత్తుగా ఓడించండి అని అయన ఓటర్లకు పిలుపునిచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉత్తరప్రదేశ్ లో ముస్లింలపై  యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కాల్పులు జరిపిందని ఆయన అన్నారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో ముస్లింలపై దాడులు జరుగుతున్నాయని భారతీయ జనతా పార్టీపై మండిపడ్డారు. దేశవ్యాప్తంగా సీఏఏపై జరుగుతున్న ఆందోళనలపై మాట్లాడుతూ.. ప్రజలను మానసికంగా విభజిస్తున్నారని, అస్సాం, బీహార్, బెంగాల్‌లో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా, విధ్వంసానికి పాల్పడి అరెస్టయిన వ్యక్తుల నుంచి నష్టపరిహారాన్ని వసూలు చేయాలన్నా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఓవైసీ శనివారం ట్వీట్ చేశారు.


అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ బీజేపీ  "మార్చాలి  లేదా పగతీర్చుకోవాలి" అనే ధోరణిలో ఉందనిఆయన మండిపడ్డారు. డిసెంబర్ 19న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుందని ఆయన ట్విట్టర్ మండిపడ్డారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..