Munneru vagu floods: కుండపోత వర్షాలతోపాటు ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో మున్నేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఖమ్మం జిల్లాలో ఇది మరింత ప్రమాదకంగా మారింది. మున్నేరు ముంచెత్తడంతో జిల్లాలోని చాలా కాలనీలు నీటమునిగాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పువ్వాడ అజయ్ పర్యటించారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. మున్నేరు ఉప్పొంగి ప్రవహించడంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరదల్లో చిక్కుకున్న ఏడుగురిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. ఇందులో చిన్నారి కూడా ఉండటం విశేషం. మున్నేరు పొంగి పొర్లడంతో జలాశయాలన్నీ జలకళను సంతరించుకున్నాయి. వేలాది ఎకరాలు నీటమునిగాయి. చాలా ఊళ్లు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు ఏపీలోని నందిగామ వద్ద మున్నేరు ఉగ్రరూపం దాల్చింది. బీటెక్‌ సప్లిమెంటరీ పరీక్షల కోసం వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు ఎన్టీఆర్ జిల్లా నందిగామకు వచ్చారు. ఇదే సమయంలో నేషనల్ హైవేపై నుంచి మున్నేరు ఉద్ధృతంగా ప్రవహించడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోన్నారు. దీంతో వీరిని పోలీసులు క్రేన్‌ సహాయంతో తరలించారు.  నందిగామ వద్ద పల్లగిరి కొండ సమీపంలో మున్నేరు వరదల్లో చిక్కుకుపోయిన ముగ్గురు వ్యక్తులను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కాపాడాయి. ఐతవరం వద్ద జాతీయ రహదారిపై మున్నేరు వాగు ధాటిగా ప్రవహిస్తుండటంతో హైదరాబాద్‌ నుంచి వెళ్లే వాహనాలను కోదాడ వద్ద దారి మళ్లిస్తున్నారు.


Also read: Telangana Rains: రాష్ట్రానికి భారీ వర్ష సూచన... నేడు అన్ని విద్యా సంస్థలకు సెలవు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook