MUNUGODE MONEY SEIZE:  తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న మునుగోడు ఉప ఎన్నికలో డబ్బు ఏరులై పారుతోంది. అధికార టీఆర్ఎస్, బీజేపీ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి పార్టీలు ఎంతకైనా తెగిస్తున్నాయని తెలుస్తోంది. మునుగోడులో డబ్బుల ప్రవాహం పెరగడంతో పోలీసులు నిఘా పెంచారు. గతంలో ఎప్పుడు లేనంతగా 40 టీములు ఏర్పాటు చేశారు. మునుగోడు వెళ్లే మార్గాల్లో 26 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. పోలీసుల తనిఖీల్లో భారీగీ నగదు పట్టుబడుతోంది. వారం రోజుల క్రితం మునుగోడులో కారులో తరలిస్తున్న కోటి రూపాయలను పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. డబ్బును తీసుకువెళుతున్న వ్యక్తిని కరీంనగర్ బీజేపీ కార్పొరేటర్ భర్తగా గుర్తించారు. తాజాగా మరోసారి మునుగోడుకు తరలిస్తున్న నగదు భారీగా పోలీసులకు పట్టుబడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన కోటి రూపాయలను పట్టుకున్నారు నార్సింగి పోలీసులు. కోకాపేట్ నుంచి నార్సింగ్ వైపు వెళ్తున్న రెండు వాహనాల్లో ఐదుగురిని అరెస్ట్ చేశారు. కోకాపేట నుండి నార్సింగీ మీదుగా వెళుతున్న హైదరాబాద్ వెళుతుండగా ఈ కార్లను ఆపడానికి పోలీసులు ప్రయత్నించారు. పోలీసులను చూసి కార్ల వేగం పెంచారు డ్రైవర్లు. దీంతో సినిమా స్టైల్లో ఛేజ్ చేసి కార్లను పట్టుకున్నారు పోలీసులు. అందులో తనిఖీ చేయగా కోటి రూపాయల నగదు పట్టుబడింది. కారులో నగదును తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. కోకాపేటలో ఉండే సునీల్ రెడ్డి వద్ద డబ్బులు తీసుకున్న దేవల్ రాజు  అనే వ్యక్తి కారులో వస్తున్నారని పోలీసులు చెప్పారు.


వ్యాపారవేత్త హర్షవర్ధన్ అదేశాల మేరకు కోకాపేట లెజెండ్ చిమినీస్ విల్లాలో ఉండే సునిల్ రెడ్డి ఇచ్చిన కోటి రుపాయలను మూడు భాగాలుగా చేసి మూడు కార్లల్లో దాచారు దేవల్ రాజు. నార్సింగ్ చౌరస్తా వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా వారి‌ కళ్లు గప్పి పారిపోయే యత్నం చేసింది దేవల్ రాజు  గ్యాంగ్. చాకచక్యంగా వ్యవహరించి కార్లను వెంబడించి పట్టుకున్నారు పోలీసులు. కోటి రూపాయల నగదు, రెండు కార్లు, ఓ మోటర్ సైకిల్, 6 మొబైల్ ఫోన్లు సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నార్సింగీ పోలీసులు. కోమటిరెడ్డి సుమంత్ రెడ్డి, కోమటిరెడ్డి సూర్య పవన్‌ అనే ఇద్దరు వ్యక్తులకు ఇవ్వడానికి కోటి రూపాయలు తీసుకెళ్తున్నట్లుగా నిందితులు చెప్పారని పోలీసుసు తెలిపారు. హవాలా మనీ పట్టుకున్న పోలీసులు మొత్తం తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు.  కోమటిరెడ్డి సుమంత్ రెడ్డి, కోమటిరెడ్డి సూర్య పవన్‌ రెడ్డి పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook