Munugode ByPoll:  మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సమీపిస్తున్న కొద్ది రాజకీయం వేడేక్కుతోంది. ప్రధాన పార్టీలన్ని ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. పోటాపోటీ వ్యూహాలతో ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నాయి. మునుగోడులో ఫ్లెక్సీల వార్ కొనసాగుతోంది. గతంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నియోజకవర్గంలో రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు వెలిశాయి. తాజాగా మాత్రం ఆయనకు మద్దతుగా ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి.సంస్థాన్‌ నారాయణపురంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అనుకూలంగా పోస్టర్లు వేశారు. 'ఫలిస్తున్న రాజన్న రాజీనామా' పేరుతో ఉన్న ఈ పోస్టర్లలో  నీ ధిక్కారంతోనే సహకారమవుతున్న మునుగోడు ప్రజల కల' అని రాశారు. ''కోమటిరెడ్డి రాజీనామాతోనే ప్రతీ గ్రామానికి రూ.20 లక్షల నిధులు వచ్చాయి. చౌటుప్పల్‌లో 5 డయాలసిస్ యూనిట్ల మంజూరు. హుటాహుటిన చేనేత బీమా ప్రకటించారు.'' అంటూ పోస్టర్లలో
 రాశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతంలో చండూరు, సంస్థాన్ నారాయణపురంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున  పోస్టర్లు వెలిశాయి. ఫోనే పే తరహాలో కాంట్రాక్ట్ పే అంటూ 18 వేల కోట్ల ప్రాజెక్ట్ అంటూ పోస్టర్లు వేశారు. మునుగోడు ఓటర్లను తాకట్టు పెట్టిన రాజగోపాల్ రెడ్డి అంటూ పోస్టర్లు వేశారు. గతంలో చండూరులో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రోడ్ షో రోజునే రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ఆ రోజే చండూరులోని కాంగ్రెస్ కార్యాలయానికి ఎవరో నిప్పు పెట్టారు. మంటల్లో కాంగ్రెస్ ప్రచార సామాగ్రి కాలిపోయింది.


సోమవారం సంస్థాన్ నారాయణపురంలో రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహిస్తున్నారు. రేవంత్ రోడ్ షో రోజే కోమటిరెడ్డికి మద్దతుగా పోస్టర్లు వెలవడం చర్చగా మారింది. మొత్తంగా మునుగోడు నియోజకవర్గంలో కొనసాగుతున్న పోస్టర్ల యుద్ధం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook