Munugode: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక అంశం హీట్ పుట్టిస్తోంది. నోటిఫికేషన్ రాకముందే రాజకీయ పార్టీలన్నీ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. అభ్యర్థులను సైతం ఖరారు చేస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఎవరన్న దానిపై క్లారిటీ వచ్చింది. ఆ పార్టీ సీనియర్ నేత పాల్వాయి గోవర్దన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతికే టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించారు. చల్లమల్ల కృష్ణారెడ్డి పేరు దాదాపు ఖరారు అయినట్లు వార్తలు వచ్చాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐతే స్థానిక పరిస్ధితులకు అనుగుణంగా పాల్వాయి స్రవంతికే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆ పార్టీ తరపున పోటీ చేయనున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ మాత్రం అభ్యర్థి పేరును ప్రకటించలేదు. దీనిపై సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెడ్డి అభ్యర్థులను ప్రకటించాయి.


దీంతో రెడ్డి వర్గం కాకుండా బడుగుబలహీన వర్గానికి చెందిన నేతకు టికెట్‌ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌కు టికెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బీసీలకు టీఆర్ఎస్ అండగా ఉంటుందన్న సంకేతం వెళ్లేలా అభ్యర్థిని ప్రకటించనున్నారు. ఇప్పటికే మునుగోడులో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. సీఎం కేసీఆర్..సభలో పాల్గొని శ్రేణులకు ఉత్సాహం నింపారు.


ఉప ఎన్నిక కోసం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని బీజేపీలో చేరారని విమర్శించారు. ఇప్పటికిప్పుడు ఉప ఎన్నిక రావాల్సిన అవసరం ఏంటని మండిపడ్డారు. ఇటు బీజేపీ సైతం ప్రచారాన్ని ఉధృతం చేసింది. ఆ పార్టీ నేత రాజగోపాల్‌రెడ్డి నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. మళ్లీ గెలిచేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈసభ ద్వారా ఆయన బీజేపీలో చేరారు.


కాంగ్రెస్ సైతం భారీ బహిరంగ సభను చేపట్టాలని యోచిస్తోంది. త్వరలో మునుగోడులో భారీ సభను ఏర్పాటు చేయనున్నారు. ఆ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ రానున్నట్లు తెలుస్తోంది. మరో నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఉండటంతో ఆమె తీసుకొచ్చే అవకాశం ఉంది. పార్టీ అభ్యర్థిపై క్లారిటీ రావడంతో ప్రచారాన్ని షురూ చేయనున్నారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీదే విజయమని స్పష్టం చేస్తున్నారు. గత ఎన్నికల అనుభవాలు రిపీట్ కాకుండా వ్యూహాలు రచిస్తున్నారు. మొత్తంగా మునుగోడులో రెడ్డి వర్సెస్ బీసీ అన్న చందంగా పోరు జరగనుంది.


Also read:Rahul Gandhi: కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడు రాహుల్ గాంధీనేనా..ఆయన ఏమన్నారంటే..!


Also read:Team India: టీ20ల్లో అత్యధిక స్కోర్లు చేసిన భారత ఆటగాళ్ల జాబితా..ఇదే..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి