Munugode Polling Updates: మునుగోడు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు క్యూ లైన్‌లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మొత్తం ఏడు మండలాల్లో 2.41 లక్షల మందికిపైగా ఓటు వేయనున్నారు. ప్రధాన పార్టీలతో 47 మంది అభ్యర్థులు మునుగోడు బరిలో పోటీ పడుతున్నారు. పారామిలటరీ బలగాలు, పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక్కడ ఓటు హక్కు లేదు. ఆయన ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తున్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు మునుగోడు నియోజకవర్గంలో స్థానికేతరులు ఉన్నారంటూ భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. అక్కడక్కడ స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. నాన్ లోకల్స్‌పై కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. చండూరులో స్థానికేతరులు బీజేపీ నేతలు మండిపడ్డారు. వారిని పట్టుకుని ప్రశ్నించగా అక్కడి నుంచి వారు పారిపోయారు. మరోవైపు బీజేపీ నేతలే నాన్ లోకల్స్ ఇక్కడ ఉన్నారని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా.. పోలీసులు చెదరగొట్టి అక్కడి నుంచి పంపించారు. 


అంతేకాకుండా యాదాద్రి భువనగిరి జిల్లా పుట్టపాక ఫంక్షన్ హాల్‌లో నాన్ లోకల్స్‌ను ఎన్నికల అబ్జర్వర్ గుర్తించారు. డబ్బులు, ఇతర సామాగ్రిని పట్టుకుని సీజ్ చేశారు. మునుగోడులోని ఓ పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఉదయం 9 గంటల వరకు 11.2 శాతం పోలింగ్ నమోదైంది. సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని గుజ్జలో ఈవీఎం మొరాయించినట్లు తెలుస్తోంది. 


Also Read: Munugode Bypoll: మునుగోడు పోలింగ్ వేళ తీవ్ర ఉద్రిక్తం.. బండి సంజయ్ అరెస్ట్


Also Read: Munugodu Polling: మునుగోడు పోలింగ్‌కు సర్వం సిద్ధం, ఓటర్లు ఎంతమంది, పోలింగ్ సిబ్బంది


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook