మునుగోడులో డబ్బులు విచ్చలవిడిగా చేతులు మారుతోంది. పోలింగ్ సమీపించడంతో ధనప్రవాహం తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటివరకూ ఏ ఉపఎన్నికలోనూ లేనంతగా ధన ప్రవాహం జరుగుతోందని తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మునుగోడులో ఈసారి అంతా డబ్బులతోనే ఎన్నిక జరుగుతున్నట్టు కన్పిస్తోంది. పట్టు కోసం ఒకరు, పరువు కోసం మరొకరు, ప్రతిష్ట కోసం ఇంకొకరు మూడు పార్టీల పోరులో మునుగోడు ఉపఎన్నిక రసవత్తరంగా, నోట్లకట్టలతో సాగుతోంది. నేతల జంపింగ్‌లు సర్వ సాధారణమయ్యాయి. మునుగోడులో ప్రధాన పోటీ మాత్రం బీజేపీ, టీఆర్ఎస్ మధ్యనే ఉంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు జరగని ప్రయత్నం లేదు. విందులు, వినోదాలు, తాయిళాలకు లక్షల్లో ఖర్చవుతోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మునుగోడు..అత్యంత ఖరీదైన ఎన్నిక కాబోతోంది.


వాస్తవానికి ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒక్కొక్క అభ్యర్ధి గరిష్టంగా చేయాల్సిన ఖర్చు 40 లక్షల రూపాయలు. కానీ మునుగోడులో ఆ పరిస్థితి లేదు. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీలు పోటీ పడి ఖర్చుచేస్తున్నాయి. పోలింగ్ తేదీ సమీపిస్తోంది. ఇప్పటికే రెండు పార్టీల ఖర్చు 200 కోట్లకు చేరుకుందని అంచనా.


మునుగోడులో ఈసారి ఓటర్లను బంగారంతో కూడా ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల సెప్టెంబర్ 20న కేసీఆర్, 21న అమిత్ షా బహిరంగసభలకే భారీగా ఖర్చుపెట్టారు. అటు ప్రతి గ్రామంలో కుల సంఘాల సమావేశాలు, ఆ సమావేశాల్లో విందులలకు లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయి టీఆర్ఎస్, బీజేపీలు. 


మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత కంపెనీ ఎక్కౌంట్ నుంచి ఓటర్లను ప్రలోభపెట్టేందుకు 5 కోట్లు రూపాయలు మళ్లించారని టీఆర్ఎస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై ఎన్నికల సంఘం కోమటిరెడ్డికి 24 గంటలు డెడ్ లైన్ విధించింది. 


ఓటుకు ఎంత


పోలింగ్ తేదీ సమీపించడంతో ఇక ఓటర్లను కొనుగోలు చేసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకూ జరిగింది ఓ ఎత్తైతే..ఇక నుంచి జరిగేది అసలు వ్యవహారం. ఒక్కొక్క ఓటరుకు ఎంతలేదన్నా1500-2000 వరకూ ఒక్కొక్క పార్టీ ఖర్చు పెట్టవచ్చని అంచనా. కొన్ని ప్రాంతాల్లో అంటే సామాజికవర్గాల పరంగా ఓట్లను కొనుగోలు చేసేటప్పుడు ఓటుకు 5 వేల వరకూ ఖర్చుపెడుతున్నారని సమాచారం. మునుగోడు ఉపఎన్నికలో ఇప్పటికే టీఆర్ఎస్-బీజేపీలు కలిసి 200 కోట్ల వరకూ ఖర్చుపెట్టారనే ప్రచారం సాగుతోంది. 


ఎన్నికల సంఘం పరిశీలకులు ఏం చేస్తున్నారు


సాధారణంగా ఎన్నికల సంఘం పరిశీలకులు పార్టీల ప్రచారం, ఖర్చుపై ప్రతిరోజూ దృష్టి పెడుతుంటారు. డబ్బులు చేతులు మారకుండా, మద్యం సరఫరా కాకుండా ఉండేందుకు..వీడియో పర్యవేక్షణ, వీడియో రివ్యూ టీమ్స్, అక్కౌంటింగ్ టీమ్స్, కంప్లైంట్ మానిటరింగ్ టీమ్స్, కాల్ సెంటర్ మానిటరింగ్ టీమ్స్ పనిచేస్తుండాలి. అయితే ఇలా చేయకుండా పార్టీలు చూపించే ఖర్చుల్నే రాసుకుంటున్నారని తెలుస్తోంది.


Also read: Rahul Gandhi On KCR: అమెరికా, చైనాలోనూ కేసీఆర్ పోటీ చేయవచ్చు.. టీఆర్ఎస్ తో కలిసే ప్రసక్తే లేదన్న రాహుల్ గాంధీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook