Rajagopal Reddy: బీజేపీపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారాల్సి వస్తే ప్రజలతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. కేసీఆర్ రాజకీయ వ్యూహాంలో తాను పావును కాదల్చుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాల్లో క్లారిటీ ఉండదని..అందుకే ఆ పార్టీ బలహీన పడిందని తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈక్రమంలో తెలంగాణలో కేసీఆర్‌ను ఓడించే శక్తి బీజేపీకే ఉందని స్పష్టం చేశారు. జైలు నుంచి వచ్చిన వారితో చెప్పించుకునే స్థాయిలో తాను లేనని చెప్పారు. మునుగోడు ప్రజలు తలుచుకుంటే ఉప ఎన్నిక వస్తుందన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. సమయం వచ్చినప్పుడు పార్టీ మారడం తప్పదని తేల్చి చెప్పారు. హైదరాబాద్‌లో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 


పార్టీ మారుతున్నారని గతకొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో కోమటిరెడ్డి స్పందించారు. ఇటీవల కేంద్రమంత్రి అమిత్ షాను కలవడం ఆసక్తికరంగా మారింది. పార్టీ మారేందుకే బీజేపీ పెద్దలతో సమావేశమవుతున్నారని ఊహాగానాలు వినిపించాయి. తాజాగా పార్టీ మార్పుపై మరింత క్లారిటీ ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ను ఎదురించేందుకు ఎంతవరకైనా వెళ్తానని పరోక్షంగా తెలిపారు. 


తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ అప్పుల పాలు చేసిందని మండిపడ్డారు. హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత ఆ పార్టీ గ్రాఫ్ పడిపోయిందన్నారు. మునుగోడులో ఉప ఎన్నికల వస్తే గెలవాలని సీఎం కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారని చెప్పారు. తనకు కాంగ్రెస్ గానీ..సోనియా గాంధీ గానీ అభిమానం అని చెప్పారు. ఐతే ఆ పార్టీ నిర్ణయాలు సరిగా లేవన్నారు. తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తులకు పార్టీ బాధ్యతలు ఇచ్చారని విమర్శించారు రాజగోపాల్‌రెడ్డి.


Also read:Minister Ktr: ఇవాళ యంగ్ డైనమిక్ లీడర్ కేటీఆర్ పుట్టిన రోజు..ప్రత్యేక కథనం..!


Also read:Lal Darwaza Bonalu LIVE* Updates: అంగరంగ వైభవంగా లాల్ దర్వాజ, అంబర్‌పేట్ బోనాలు...



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook