Nagakanya In Karimnagar: నేనే నాగకన్యను.. నాకు గుడి కట్టండి! పాములాగా యువతి వింత చేష్టలు
Karimnagar Young Woman Krishnaveni wants a Temple. తనను నాగదేవత ఆవహించిందని, తనకు తక్షణమే గుడికట్టాలంటోంది కరీంనగర్ జిల్లాలోని ఎగ్లాస్‌పూర్‌కు చెందిన యువతి కృష్ణవేణి.
Karimnagar Young Woman Krishnaveni feels She is a Nagakanya: ఓ యువతి పాములాగా వింత చేష్టలు చేస్తోంది. తనను నాగదేవత ఆవహించిందని, తనకు తక్షణమే గుడికట్టాలంటోంది. కూలిన ఆలయాన్ని మళ్లీ కట్టేవరకూ తాను నాగకన్యగానే ఉంటానంటోంది సదరు యువతి. ఆ యువతి అచ్చం పాములా ప్రవర్తిస్తూ.. రోజూ నాగదేవత గుడికి వెళ్లి పూజలు చేస్తోంది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
సైదాపూర్ మండలం ఎగ్లాస్‌పూర్‌కు చెందిన కృష్ణవేణి అనే యువతి డిగ్రీ వరకూ చదివింది. అనారోగ్యంతో తల్లిదండ్రులు చనిపోవడంతో.. నానమ్మ వద్ద ఉంటోంది. ఇదివరకు ఆమె ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పనిచేసింది. గత నాలుగేళ్లుగా కృష్ణవేణి తాను నాగకన్యను అంటూ వింతగా ప్రవర్తిస్తోంది. నిత్యం గ్రామానికి చుట్టుపక్కల ఉండే పాము పుట్టలు, నాగదేవత ఆలయాలకు వెళ్లి పూజలు చేస్తోంది. చాలా ఏళ్ల క్రితమే తాను నాగకన్యగా మారానని గ్రామస్తులకు చెప్తోంది. తన కలలో పాములు కూడా కనిపిస్తున్నాయని కృష్ణవేణి వివరిస్తోంది.
తన శరీరంలో మార్పులు వస్తున్నాయని, శరీరంపై గీతలు ఏర్పడుతున్నాయని కృష్ణవేణి అందరికీ చెబుతోంది. అప్పుడప్పుడు నాగినిలా డాన్స్ కూడా చేస్తోంది. గ్రామ శివారులో ఉన్న నాగదేవత విగ్రహానికి గుడి నిర్మించాలని, అప్పుడే తన శరీరంలో నుంచి నాగకన్య వెళ్లిపోతుందని గ్రామస్తులకు చెబుతోంది. కృష్ణవేణి వింత చేష్టలకు చట్టుపక్కల వారు భయాందోళన చెందుతున్నారు. అయితే కొందరు స్థానికులు కృష్ణవేణి మానసిక పరిస్థితి సరిగా లేదని, అందుకే ఇలా ప్రవర్తిస్తుందని అంటున్నారు. ఏదేమైనా కృష్ణవేణి ప్రవర్తన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
Also Read: Virat Kohli: ఆ ఒక్కటి లేకుంటే.. విరాట్ కోహ్లీ 100 కాదు 200 సెంచరీలు చేసినా ఉపయోగం లేదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.