Nagarjuna vs Konda Surekha Defamation Case: హీరో నాగార్జున మంత్రి కొండా సురేఖపై వేసిన డిఫమేషన్‌ కేసులో భాగంగా నిన్న ఆయన నాంపల్లి హైకోర్టులో హాజరయ్యారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తమ కుటుంబాన్ని కుంగదీసిందని, తాము తీవ్ర మనోవేధనకు గురయ్యామని నాగార్జున ధర్మాసనం ముందు స్టేట్‌మెంట్ ఇచ్చారు. అయితే, కొండా సురేఖ లాయర్‌ మాత్రం మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఎక్కడా 'పడుకో' అని చెప్పలేదు. డిఫమేషన్‌ కేసు వేయడం జోకింగ్‌, హస్యాస్పదం అంటూ కాంట్రోవర్షియల్‌ కామెంట్లు చేశారు. అంతేకాదు గెలుపు సురేఖదే అని ధీమా వ్యక్తం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలు ఎక్కడా కూడా కొండా సురేఖ పడుకో అని చెప్పిందా? అసభ్యపదజాలం వాడిందా? అన్నారు. ఇది వారికి ఇన్సల్ట్‌గా అనిపించడం జోకింగ్‌గా ఉంది. నవ్వులాటగా ఉంది మాకుమ కూడా అంటూ షాకింగ్‌ కామెంట్లు చేశారు సురేఖ లాయర్.అయితే, కొండా సురేఖ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను విత్‌డ్రా చేసుకున్నారు.కానీ, ఎక్కడా కూడా సమంతకు సారీ చెప్పలేదు కదా.. అని ఓ విలేఖరి సురేఖ లాయర్‌ను ప్రశ్నించారు. సెలబ్రిటీ పేరు తీసుకున్నందుకు ఈగో హర్ట్‌ అయిందని ఆమెకు క్షమాపణ చెప్పారు అంతే అని లాయర్ పేర్కొన్నారు.


ఇదీ చదవండి: ఉచిత గ్యాస్‌ సిలిండర్‌కు ఇలా అప్లై చేసుకోండి.. అర్హులు ఎవరంటే..?  


అయితే ఓ మహిళగా మీరు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా? అని సదరు విలేకరి అడగగా ఆమె ఏం తప్పు మాట్లాడిందని టాలీవుడ్‌ మొత్తం ఏకమై స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు? సినిమా ఫీల్డ్‌ అంటే అందరికీ తెలిసిందే.. హీరో, హిరోయిన్‌ అంటే కూడా అందరికీ తెలిసిందే అంటూ కాంట్రోవర్షియల్‌ కామెంట్లు చేశారు కొండా సురేఖ తరఫున వాదిస్తున్న లాయర్‌.
ఇదిలా ఉండగా నిన్న సుప్రియను మొదటి సాక్షిగా ఆమె స్టేట్‌మెంటను కూడా ధర్మాసనం రికార్డు చేసింది.


ధర్మాసనం ముందు నాగార్జున మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు తనను తన కుటుంబాన్ని మానసిక వేదనకు గురిచేసిందని, రాజకీయ దురుద్దేశంతో ఇలా కావాలని తన కుటుంబంపై వ్యాఖ్యలు చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలు అన్ని టీవీ ఛానల్లలో ప్రసారమైంది.దీంతో తన కుటుంబం పరువు దెబ్బతినిందని నాగర్జున ధర్మాసనం ముందు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అలాగే సదరు మంత్రి చేసిన వ్యాఖ్యలకు గాను క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని కోరినట్లు తెలుస్తోంది.


ఇదీ చదవండి: జియో అదిరిపోయే శుభవార్త.. 84 రోజులు ఫ్రీ నెట్‌ఫ్లిక్స్‌, జియోటీవీ మరెన్నో లాభాలు..


బాపుఘాట్‌ సమావేశంలో మంత్రి కొండా సురేఖ కేటీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేయకూడదంటే తన కోడలు సమంతను కేటీఆర్‌ వద్దకు పంపించాలని అన్నాడు. దీనికి ఆమె ఒప్పుకోకపోవడంతో డైవర్స్‌ ఇచ్చారు అని సురేఖ వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల సమంత నాగచైతన్య విడిపోయిన సంగతి తెలిసిందే.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.