Nagarjuna Sagar By Poll: నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో తెలంగాణ అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) జోరు కొనసాగుతోంది. నేటి ఉదయం 8 గంటలకు సాగర్ ఉప ఎన్నిక ఓట్లంపు ప్రారంభం కాగా, ప్రతి రౌండ్‌లోనూ టీఆర్ఎస్ ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. గూలాబీ శ్రేణులు తమ పార్టీ అభ్యర్థి నోముల భగత్ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నేత జానారెడ్డి గెలుపు ఖాయమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నల్లగొండలోని తెలంగాణ గిడ్డంగుల సంస్థ ప్రాంగణంలో కౌంటింగ్ ప్రారంభమైన తొలి రౌండ్ నుంచే టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. తాజాగా ఆరో రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు ఆధిక్యం లభించగా, మొత్తం ఆధిక్యం 5,177 ఓట్లకు చేరింది. 6వ రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 3,989, కాంగ్రెస్ పార్టీకి 3,049 ఓట్లు పోలయ్యాయి. గుర్రంపోడు మండలంపైనే కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఆశలు పెట్టుకోగా, ఇక్కడ సైతం టీఆర్ఎస్ ఆధిక్యం సాధించింది. దాంతో ఇప్పటివరకూ లెక్కించిన(6) ఏ రౌండ్ లోనూ  కాంగ్రెస్ ఆధిక్యం కనబర్చలేకపోయింది. 


Also Read: Tamil Nadu Assembly Election Results: తమిళనాడు ఎన్నికల్లో ప్రతిపక్ష DMKకు ఆధిక్యం


13 రౌండ్ అనంతరం టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌ 10,509 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. టీఆర్ఎస్‌కు 46,523 ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 36,014 ఓట్లు పోలయ్యాయి. 


పదకొండో రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 3,395 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ 2,325 ఓట్లు పోలయ్యాయి. ఈ రౌండ్లోనూ నోముల భగత్‌కు వెయ్యి ఓట్ల ఆధిక్యం లభించింది.


పదో రౌండ్లో జానా రెడ్డికి 3,166 ఓట్లు రాగా, నోముల భగత్‌కు 2,991 ఓట్లు వచ్చాయి. ఓవరాల్‌గా నోముల భగత్‌కు 35,529 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి జానా రెడ్డికి 27,565 ఓట్లు పోలయ్యాయి. టీఆర్ఎస్ మొత్తం ఆధిక్యం 7,964కు చేరింది.


తొమ్మిదో రౌండ్‌లో నోముల భగత్‌కు 2,205, కాంగ్రెస్‌కు 1,954 ఓట్లు పోలయ్యాయి.


ఎనిమిదో రౌండ్ అనంతరం టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు 30,333 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డికి 22,445 ఓట్లు పడ్డాయి. టీఆర్ఎస్‌కు 7,888 ఓట్ల ఆధిక్యం.


ఏడో రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 3,382 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థికి 2,607 ఓట్లు పోలయ్యాయి. ఓవరాల్‌గా టీఆర్ఎస్ 6,500 ఆధిక్యంలో ఉంది.


ఐదో రౌండ్‌టో టీఆర్ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌కు 3,442, కాంగ్రెస్‌కు 2676 ఓట్లు, బీజేపీకి 74 ఓట్లు పోల‌య్యాయి.


నాల్గో రౌండ్‌‌లో టీఆర్ఎస్‌కు 984 ఓట్ల ఆధిక్యం లభించింది. టీఆర్‌ఎస్‌కు 4,186 ఓట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డికి 3,202 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా 3457 ఓట్ల ఆధిక్యంలో నోముల భ‌గ‌త్‌ ఉన్నారు.


మూడో రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు 3421, కాంగ్రెస్ పార్టీకి 2,882 ఓట్లు పోల‌య్యాయి. ఈ రౌండ్‌లోనూ టీఎర్ఎస్‌కు ఆధిక్యం లభించింది.


Also Read: Gold Price In Hyderabad 02 May 2021: బులియన్ మార్కెట్‌లో దిగొచ్చిన బంగారం ధరలు, Silver Price


నాగార్జున‌సాగ‌ర్ బై పోల్ ఓట్ల లెక్కింపు రెండో రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 2,216 ఓట్ల ఆధిక్యం లభించింది. రెండో రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 3,854 ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 3113 ఓట్లు పోలైనట్లు అధికారులు తెలిపారు. 


తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి భ‌గ‌త్‌కు 4,228 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థికి 2,753 ఓట్లు వచ్చాయి. తొలి రౌండ్ నుంచే టీఆర్ఎస్ ఆధిపత్యం చెలాయిస్తోంది. మొత్తం 25 రౌండ్ల వరకు ఓట్ల లెక్కింపు జరగనుంది.


Also Read: Assembly Elections 2021 Results Live News Update: పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ఆధిక్యం 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook