నందమూరి హరికృష్ణ అంతిమయాత్ర వాహనం ఇదే
నందమూరి హరికృష్ణ అంతిమయాత్ర వాహనం
నల్గొండ జిల్లాలోని అద్దంకి హైవేపై బుధవారం తెల్లవారుజామున జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలై హఠాన్మరణం చెందిన ప్రముఖ సినీనటుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ పార్థివదేహానికి ఇంకొద్దిసేపట్లో అంతిమయాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న ఈ అంతిమయాత్ర మెహిదీపట్నం నుంచి సరోజినీదేవి కంటి ఆస్పత్రి, రేతిబౌలి, నానల్‌నగర్, టోలిచౌకీ, షేక్‌పేట్ నాలా, విస్పర్ వ్యాలీ మీదుగా సాయంత్రం 6 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానానికి చేరుకోనుంది. అనంతరం ప్రభుత్వ లాంఛనాల మధ్య నందమూరి హరికృష్ణ పార్థివదేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి. దశాబ్ధాల తరబడి సినీ పరిశ్రమలో కొనసాగుతున్న నందమూరి కుటుంబంతో అన్ని రంగాల ప్రముఖులకు సత్సంబంధాలున్న నేపథ్యంలో వివిధ రంగాల ప్రముఖులు నందమూరి హరికృష్ణ నివాసానికి చేరుకుని ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్నారు. నందమూరి హరికృష్ణ అంతిమయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన పార్థివదేహాన్ని అంతిమయాత్రగా తీసుకెళ్లేందుకు సిద్ధమైన వాహనానికి సంబంధించిన వీడియోను జూనియర్ ఎన్టీఆర్ అభిమాని ఒకరు ట్విటర్ ద్వారా పంచుకున్నారు.
The mortal remains of #NandamuriHarikrishna garu will be carried in this vehicle till Filmnagar Mahaprasthanam. pic.twitter.com/I601ZLPQoa
నందమూరి కుటుంబంతో ఎంతో అనుబంధం ఉన్న సినీ, రాజకీయ ప్రముఖులు నందమూరి హరికృష్ణ మృతిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక పెద్ద దిక్కును కోల్పోయిన కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ సోదరుల కుటుంబసభ్యులను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. అన్నయ్య జానకిరామ్ రోడ్డు ప్రమాదంలోనే తమకు దూరమయ్యారనే చేదునిజాన్ని ఇంకా జీర్ణించుకోలేని ఆ కుటుంబానికి ఈ రోడ్డు ప్రమాదం మరో విషాదాన్ని మిగిల్చింది.