Nandi Statue Drinking Milk in Shivalayam at Karimnagar: దేవుడి విషయంలో ఎన్నో నమ్మలేనివి నిజాలను ఇప్పటికే మనం విన్నాం, చూశాం. శివరాత్రి రోజు శివాల‌యంలో పాము పాలు తాగడం.. పుట్టలోని పాములు గుడ్లు మింగడం, పాలు తాగడం సహజమే. అయితే విగ్రహాలు పాలు, నీళ్లు తాగడం మాత్రం కాస్త వింతే అని చెప్పాలి. గతంలో గణేశుడి విగ్రహం పాలు తాగడం, శ్రీరాముడి విగ్రహం కన్నీళ్లు పెట్టుకోవడం, సాయిబాబా విభూతి రాల్చడం లాంటి అరుదైన సంఘటనలకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజాగా పరమ శివుడి ముందుండే నంది విగ్రహం పాలు తాగుతుందట. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలో శివాలయం ఉంది. ప్రతిరోజు భక్తులు ఆలయానికి వెళ్లి శివుడికి పూజలు చేస్తారు. ఈ క్రమంలో కొందరు భక్తులు మంగళవారం (మార్చి 8) శివాలయానికి వెళ్లి శివుని దర్శనం చేసుకున్నారు. అనంతరం నంది విగ్రహానికి పాలు పోయగా.. అది తాగేసింది. మరికొంతమంది సైతం పాలు పోయగా నంది విగ్రహం తాగేసింది. ఈ ఘటన చూసిన భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. 


విషయం తెలుసుకున్న భక్తులు గిన్నెలు, చెంచాలతో శివాలయంలోని నంది విగ్రహానికి పాలు తాగించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో  వైరల్ అయింది. ఓ భక్తుడు చెంచాతో పాలు పోయగా.. నంది విగ్రహం తాగడం మనం వీడియోలో చూడొచ్చు. నిజంగానే నంది పాలు తాగుతుందా? లేదా విగ్రహం పీల్చేస్తుందా? అని అందరూ అయోమయంలో ఉన్నారు. భక్తులు మాత్రం ఇదంతా శివయ్య మహిమ అంటూ పూజలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల భక్తులు ఆలయానికి పోటెత్తుతున్నారు. 



ఆదిలాబాద్‌ జిల్లా క్రాంతినగర్‌లోని శివాలయంలో కూడా నంది విగ్రహం పాలు తాగిందట. గాండ్ల సంఘం శివాలయంలోని నందికి భక్తులు పాలు పోశారు. అయితే నంది పాలు తాగడం భక్తులు గమనించారు. ముందు షాక్ తిన్నా.. ఆ తర్వాత గిన్నెలు, చెంచాలతో పాలు పోశారు. ఇక్కడ కూడా నంది పాలు తాగడం వీడియోలో కనిపిస్తోంది. మహా శివరాత్రి మహోత్సవం ముగిసిన తర్వాత ఈ ఘటన జరగడంతో ఇదంతా దైవ లీల అని అందరూ అంటున్నారు. 


Also Read: Rashmika Mandanna: రష్మిక మందన్న క్రేజ్ మాములుగా లేదుగా.. బాలీవుడ్ స్టార్ హీరోతో..!!


Also Read: Alia Bhatt Hollywood debut: ఆలియా భట్ హాలీవుడ్ ఎంట్రీ షురూ.. త్వరలో ఆ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.