Prayaschitta Deeksha: తెలుగు రాష్ట్రాలతో దేశవ్యాప్తంగా తిరుమల వివాదం రచ్చ రేపుతోంది. జరిగిన వాస్తవమేమిటో ఇంకా ఎవరికీ తెలియకున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన జంతు కొవ్వు వ్యాఖ్యలు మాత్రం తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో హిందూ ధర్మ రక్షణ కోసమంటూ సరికొత్త ప్రాయశ్చిత దీక్షకు కూర్చుంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎంపీ వీ హనుమంత రావు కూడా ప్రాయశ్చిత దీక్షకు కూర్చున్నారు. అయితే ఒకరోజు పాటు కూర్చున్న ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Harish Rao: రేవంత్‌ది గూండా రాజ్యం.. ఇలాగైతే తెలంగాణ మరో సీమ, బిహార్


హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానంలో మంగళవారం వీహెచ్‌ దీక్షకు పూనారు. దాదాపు 80 ఏళ్ల వయసులో ఆయన ధర్మ పరిరక్షణ కోసం దీక్షకు దిగడం ఆసక్తికరంగా మారింది. అనంతరం మధ్యాహ్నం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తిరుమల వివాదంపై సీబీఐ విచారణ చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. ఇంకా వివాదాన్ని రాజకీయం చేయకుండా వెంటనే పరిష్కారం చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు సూచించారు.

Also Read: Family Cards: 'ఒక రాష్ట్రం-ఒక కార్డు' తెలంగాణ కొత్త ప్రయోగం.. రేషన్‌, హెల్త్‌ రెండూ ఒకటే


'వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని దీక్షకు కూర్చున్నాను. తిరుమలలో జరుగుతున్న ఘటన తీవ్రంగా కలిచివేసింది. ప్రపంచంలోనే వెంకన్న లడ్డూకు పవిత్రత ఉంటుంది. అలాంటి పవిత్రమైన లడ్డూలో జంతువుల కొవ్వు కలపడం దారుణం. ప్రపంచ దేశాలలో వెంకన్న భక్తులు ఉన్నారు. గతంలో వైసీపీ , ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది. ఎవరున్నా కూడా తిరుమలపై రాజకీయం వద్దు' అని మాజీ ఎంపీ వీహెచ్‌ హితవు పలికారు.


'తిరుమలలో దేవుడిపై ఒట్టు వేస్తూ రాజకీయం చేస్తున్నారు. సీబీఐ విచారణ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. నేను చేస్తున్న దీక్షతో అయిన కేంద్ర ప్రభుత్వంలో చలనం రావాలి. ఈ సమస్య తొందరగా పరిష్కరించాలి. లేకపోతే ప్రజల్లో గందరగోళం పరిస్థితి ఏర్పడుతుంది' అని హనుమంత రావు తెలిపారు. 'భగవంతుడి దగ్గర కూడా అవినీతికి పాల్పడటం దౌర్భాగ్యం. సీబీఐ విచారణ త్వరగా చేసి  బాధ్యులను కఠినంగా శిక్షించాలి' అని డిమాండ్‌ చేశారు. కాగా ఏపీలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. అలాంటిదే వీహెచ్‌ చేపట్టడం విశేషం.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.