Oxygen cylinders suppliers contacts: ఆక్సీజన్ సిలిండర్స్ కావాలా ? ఆక్సీజన్ సరఫరాదారుల డీటేల్స్ ఇదిగో
Oxygen cylinders suppliers contacts in your city: కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజురోజుకూ భారీగా కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య (COVID-19) పెరుగుతుండటంతో అంతే భారీగా రోగుల సంఖ్య కూడా పెరుగుతోంది. వారిలోనూ శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆక్సీజన్ అవసరం ఎక్కువగా ఉండటంతో ఇదివరకటితో పోల్చుకుంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆక్సీజన్ సిలిండర్ల (Oxygen shortage) కొరత ఏర్పడుతోంది.
Oxygen cylinders suppliers contacts in your city: కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజురోజుకూ భారీగా కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య (COVID-19) పెరుగుతుండటంతో అంతే భారీగా రోగుల సంఖ్య కూడా పెరుగుతోంది. వారిలోనూ శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆక్సీజన్ అవసరం ఎక్కువగా ఉండటంతో ఇదివరకటితో పోల్చుకుంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆక్సీజన్ సిలిండర్ల కొరత ఏర్పడుతోంది. ఆస్పత్రుల్లో చికిత్స పొందే రోగులకు, ఇంటి వద్దే ఉండి చికిత్స పొందే రోగులకు ఆక్సీజన్ అవసరాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) సైతం ఆక్సీజన్ సరఫరా-కొరత-డిమాండ్ వంటి అంశాలపై సంబంధిత శాఖలను సమన్వయం చేస్తూ సమీక్ష నిర్వహించారు. ఆక్సీజన్ సరఫరా కోసం కేంద్రం, రాష్ట్రాల మధ్య సంప్రదింపులు కూడా జరుగుతున్నాయి.
ముఖ్యంగా ఆస్పత్రుల్లో చికిత్స పొందే రోగులకు ఆక్సీజన్ సరఫరా బాధ్యతలు ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలే చూసుకుంటున్నాయి కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇంటి దగ్గరే ఉండి చికిత్స పొందే రోగులకు అందే ఆక్సీజన్ సరఫరాలోనే ఇబ్బందులు ఎక్కువవుతున్నాయి. మరోవైపు ఆర్థిక స్థోమత ఉన్న వాళ్లు ఎంత దూర ప్రాంతాల నుండి అయినా ఆక్సీజన్ సిలిండర్లను సరఫరా (Oxygen cylinders suppliers) చేసుకునేందుకు వెనుకాడకపోవడంతో లోకల్, నాన్-లోకల్ అని తేడా లేకుండా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆక్సీజన్ సిలిండర్ల సరఫరా జరుగుతోంది.
ఆక్సీజన్‌కి అనూహ్యంగా భారీ డిమాండ్ పెరిగి కొరత ఏర్పడటంతో ప్రస్తుతం ఆక్సీజన్ సరఫరాదారుల (Oxygen sellers in Hyderabad) డీటేల్స్ కోసం చాలామంది ఆన్‌లైన్‌లో అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో ఆ వివరాలతో పాటు దేశం నలుమూలలా పలు పెద్ద పెద్ద నగరాల్లో ఆక్సీజన్ సరఫరాదారుల వివరాలను ఇక్కడ చూద్దాం.
Also read: AP Corona Second Wave: సెక్రటేరియట్ ఉద్యోగులకు కరోనా సెగ, వర్క్ ఫ్రం హోం
1) ఇదిగో దేశంలోనే పేరున్న ఆస్పత్రుల్లో ఒకటైన అపోలో ఆస్పత్రి వాళ్లు Apollo home care పేరిట అందిస్తున్న సేవల్లో ఆక్సీజన్ సరఫరా కూడా ఒకటిగా ఉంది. మీ పేరు, ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి, అడ్రస్ వివరాలు అందించడం ద్వారా ఆక్సీజన్ సిలిండర్లను కొనడం లేదా రెంట్‌కి తీసుకోవడం చేయవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ (Oxygen suppliers in Hyderabad), చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, మైసూరు, మదురై, భువనేశ్వర్, పూణే, ఢిల్లీలో (Oxygen suppliers in Delhi NCR) ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.
2) ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్స్ అయిన అమేజాన్, ఫ్లిప్‌కార్ట్‌లోనూ ఆక్సీజన్ సిలిండర్ల సరఫరా కోసం ఆర్డర్ చేసి హోమ్ డెలివరీ (Oxygen home delivery) పొందవచ్చు.
3) ఇదిగో https://www.portea.com అనే ఈ వెబ్‌సైట్ ద్వారా కూడా మీరు 5 లేదా 10 లీటర్ల ఆక్సీజన్ సిలిండర్లు కొనుగోలు చేయవచ్చు లేదా అద్దెకి తీసుకోవచ్చు.
4) ఇదిగో ఇక్కడ సైతం ఆక్సీజన్ సిలిండర్స్ విక్రయాలు, అద్దెకు అందుబాటులో ఉంటాయి. https://www.air6.in.
5) ముంబైలో ఆక్సీజన్ సప్లయర్స్ వివరాలు
మహారాష్ట్ర హెల్త్ కేర్ : 8080106018, జుపిటర్ ఎక్విప్‌మెంట్ - 9619381829, ఆల్ ఇండియా హెల్త్ కేర్ - 9820882022, కేర్ బయోమెడికల్ - 077382 23332
Also read: Tamil comedian Vivek's death news : తమిళ హాస్యనటుడు వివేక్ గుండెపోటుతో మృతి, పలువురు ప్రముఖుల సంతాపం
6) భోపాల్‌లో Oxygen suppliers వివరాలు:
ఎలిక్సిర్ ఎంటర్‌ప్రైజెస్ - 9893055289, భారతి ఎయిర్ ప్రోడక్ట్స్ - 7552601933
7) నొయిడాలో ఆక్సీజన్ సప్లయర్స్ | Oxygen suppliers in Noida:
మిట్టల్ ఎయిర్ ప్రోడక్ట్స్ - 98993 90876, ఆక్సీజన్ సిలిండర్ రెంటల్ - 9810475170, ఆక్సీజన్ కాన్‌సంట్రేటర్ ఫర్ రెంట్ - 7838948874.
8) ఘాజియాబాద్‌లో ఆక్సీజన్ సప్లయర్స్ | Oxygen suppliers in Ghaziabad:
అప్సోల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ - 8840886102, ఆలియా హెల్త్ కేర్ గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్ (Rajeev Pathak) - 9899019007. ఆక్సీజన్ కాన్‌సంట్రేటర్ ఇన్ ఘాజియాబాద్: రంజిత్ - 9310719082
ముంబై, నొయిడా, ఘాజియాబాద్, భోపాల్ వంటి ప్రాంతాల నుంచి తెలుగు రాష్ట్రాలకు నిత్యం రాకపోకలు సాగించే ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీస్, ఫ్రైట్ సర్వీసెస్ ఉండటంతో అలా వారి సేవలు పొందే అవకాశం ఉంటుంది. లేదంటే అపోలో హెల్త్ కేర్‌తోపాటు పలు ఇతర వాణిజ్య సంస్థలు కూడా ఆక్సీజన్ సరఫరా అందిస్తున్నాయి. ఇవీ కాకుండా అమేజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్ ఆక్సీజన్ హోమ్ డెలివరీ (Oxygen home delivery) చేస్తున్నాయి. కరోనా (COVID-19) రోగుల్లో శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి ఆక్సీజన్ సరఫరా అత్యవసరం కావడంతో ప్రస్తుతం ఆక్సీజన్ సరఫరాదారులకు కూడా భారీ డిమాండ్ ఏర్పడింది.
Also read : Corona second wave: మరింత ప్రమాదకరంగా కరోనా సెకండ్ వేవ్, గంటల వ్యవధిలో వైరస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe