కేటీఆర్‌కు అనుకోని ఓ ప్రశ్న ఎదురైతే..
సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు నెటిజన్ నుంచి అనుకోని ఓ ప్రశ్న ఎదురైంది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు నెటిజన్ నుంచి అనుకోని ఓ ప్రశ్న ఎదురైంది. వైఎస్సార్, కేసీఆర్ ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు అని కేటీఆర్‌ను ఓ నెటిజన్ ప్రశ్నించారు. దీనికి కేటీఆర్ తనదైన రీతిలో సమాధానమిచ్చారు. ‘సమాధానం ఏమిటో మీకు తెలుసు’ అంటూ ఆ నెటిజన్ ప్రశ్నకు బదులిచ్చారు కేటీఆర్.
కేటీఆర్ ఇచ్చిన ఈ ఆన్సర్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. చాలామంది ఈ ప్రశ్నకు ‘ఇంకెవరు.. కేసీఆరే’ అంటూ కామెంట్లు చేశారు. కేటీఆర్ గొప్పగా సమాధానం చెప్పారని కొందరు చెప్తే.. ఆ ఇద్దరినీ పోల్చలేమంటూ మరికొందరు అన్నారు.
ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు కేటీఆర్ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ‘ఆస్క్‌కేటీఆర్’ అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేశారు. దీనికి ట్విట్టర్‌లో భారీ స్పందనొచ్చింది. అనేక మంది నగరవాసులు రోడ్ల పరిస్థితుల గురించి అడిగారు. అటు గ్రామీణ ప్రాంతాల వారు కూడా తమ ప్రాంతంలోని సమస్యల గురించి అడిగారు.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్‌ఎస్ సిద్ధం: మంత్రి కేటీఆర్
ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్‌ఎస్ సిద్ధమని ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ అన్నారు. ఆస్క్ కేటీఆర్ ద్వారా నెటిజన్ల ప్రశ్నలకు సమాధానమిస్తూ, సిరిసిల్ల నుంచి ఇప్పటికే మూడుసార్లు గెలిచానని, సిరిసిల్ల ప్రజలకు విశ్వాసంగా ఉంటానని పేర్కొన్నారు. బుద్వేల్ ఐటీ క్లస్టర్‌కు సంబంధించి మంత్రివర్గ అనుమతి కోసం వేచి చూస్తున్నామన్నారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. జూలై 24న తన జన్మదినం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని కేటీఆర్ కోరారు.