New excise policy in Telangana: హైదరాబాద్: తెలంగాణలో కొత్త మద్యం పాలసీ అమలుకు చకచకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. మద్యం కొత్త పాలసీపై ఎక్సైజ్ అధికారులు ఎక్సర్‌సైజ్ చేస్తున్నారు. వాస్తవానికి ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి కొత్త మద్యం పాలసీ వస్తుంది. అలా ఈ ఏడాది అక్టోబర్‌తో పాత టెండర్ల కాలపరిమితి ముగియాల్సి ఉంది. అయితే కరోనావైరస్ కారణంగా మధ్యలో లాక్‌డౌన్ రావడంతో కొద్దిరోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడ్డాయి. మద్యం దుకాణాలకు నష్టపరిహారంగా పాత లైసెన్సులను మరో నెలరోజుల పాటు పొడిగించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నవంబర్‌తో పాత పాలసీ ముగియనుండటంతో డిసెంబర్ నుంచి కొత్త పాలసీని అమలు చేయాల్సి ఉంది. అందులో భాగంగానే దీపావళి పండగ (Diwali 2021) తరువాత మద్యం దుకాణాలకు టెండర్లు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. నవంబర్ 2న హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితాలు (Huzurabad bypolls results) రాగానే కొత్త మద్యం పాలసీకి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. 


అయితే, అంతకంటే ముందుగా మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్ల అమలులో సమన్యాయం జరగడం లేదంటూ గతంలో తెలంగాణ హై కోర్టులో దాఖలై ఉన్న ఓ పాత పిటిషన్‌పై ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2216 మద్యం దుకాణాలు (Liquor shops in Telangana) ఉండగా కొత్త పాలసీ ప్రకారం మరో 10 శాతం దుకాణాలు పెరిగే అవకాశం ఉంది.