Traffic Fines: హైదరాబాద్‌లో గీత దాటితే ఫైన్ తప్పదు. ఈమేరకు జంట నగరాల్లో ట్రాఫిక్ పోలీసులు కొత్త నిబంధనలు తీసుకురానున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద స్టాప్ లైన్ దాటితే వంద రూపాయల ఫైన్ వేయనున్నారు. ఫ్రీ లెఫ్ట్‌కు ఆటంకం కల్గిస్తే రూ. వెయ్యి జరిమానా విధించనున్నారు. పాదచారులకు ఆటంకం కలిగించేలా వాహనాలు నిలిపితే రూ.600 జరిమానా ఉండనుంది. ఈమేరకు ట్రాఫిక్ పోలీసులు అధికారికంగా తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈనిబంధనలు అక్టోబర్ 3 నుంచి అమల్లోకి రానున్నాయి. నిబంధనలు పాటించని వారికి జరిమానాలు తప్పవంటున్నారు. ఈవిషయాన్ని ట్రాఫిక్ పోలీసు జాయింట్ కమిషనర్ రంగనాథ్‌ తెలిపారు. ఇందుకు నగర వాసులు సహకరించాలని పిలుపునిచ్చారు. నగరంలో ట్రాఫిక్‌ సమస్యలు పరిష్కరించేందుకు ఈచర్యలు తీసుకున్నట్లు తెలిపారు. దీనిపై పలు దఫాలుగా అధికారులకు చర్చించిన హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. 


రోప్(రిమూవల్ ఆఫ్ అబ్‌స్ట్రిక్టివ్ పార్కింగ్ అండ్ ఎంక్రోచ్‌మెంట్) పేరుతో ఈకార్యక్రమాన్ని చేపట్టనున్నారు. భరత్ అనే నేను సినిమా తరహాలో జరిమానాలను తీసుకొచ్చారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జరిమానా అంశాన్ని పునరాలోచించాలని కొందరు కోరుతున్నారు. మరికొందరు దీనిని స్వాగతిస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల నిబంధనలు పక్కగా అమలు అవుతాయని అంటున్నారు. 


Also read:PM Modi: మానవత్వం చాటిన ప్రధాని మోదీ..అసలేమి జరిగిదంటే..!


Also read:CM Kcr: యాదాద్రిపై ఆధ్యాత్మిక శోభ విలసిల్లాలి..పనులపై సీఎం కేసీఆర్ ఆరా..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.