Survey: భర్త భార్యను కొట్టడం సమర్థనీయమేనా-తెలుగు రాష్ట్రాల మహిళల షాకింగ్ రిప్లై
National Family Health Survey : భర్త భార్యను కొట్టడం సమర్థనీయమేనా...? ఏ పరిస్థితుల్లో భర్త భార్యను కొడుతాడు...? నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే(NFHS) సంస్థ ఈ అంశాలపై ఇటీవల సర్వే నిర్వహించగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
National Family Health Survey : నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే(NFHS) సంస్థ ఇటీవల ఓ అంశంపై 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్వే (Survey) నిర్వహించింది. 'భర్త భార్యను కొట్టడం సమర్థనీయమేనా..?' (Domestic violence) అని మహిళా లోకాన్ని ప్రశ్నించింది. తెలుగు రాష్ట్రాల మహిళలే దీన్ని అత్యధికంగా సమర్థించడం గమనార్హం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో 84శాతం మంది మహిళలు దీన్ని సమర్థించారు. కర్ణాటకలో 77 శాతం మంది మహిళలు సమర్థించారు.
మణిపూర్‌లో 66 శాతం మంది, కేరళలో 52 శాతం మంది, జమ్మూకశ్మీర్‌లో 49 శాతం మంది, మహారాష్ట్రలో 44 శాతం మంది, పశ్చిమ బెంగాల్‌లో 42 శాతం మంది మహిళలు భర్త భార్యను కొట్టడం సమర్థనీయమేనని సర్వే ద్వారా వెల్లడించారు. అత్యల్పంగా హిమాచల్‌ప్రదేశ్‌లో (Himachal Pradesh) కేవలం 14.2 శాతం మహిళలు మాత్రమే దీన్ని సమర్థించారు. మొత్తం 14 రాష్ట్రాల్లో కలిపి 30 శాతం మంది మహిళలు ఈ చర్యను సమర్థిస్తున్నట్లు చెప్పారు. ఇదే ప్రశ్న పురుషులనూ అడగ్గా... అత్యధికంగా కర్ణాటకలో (Karnataka) 81.9శాతం మంది పురుషులు భర్త భార్యను కొట్టడాన్ని సమర్థించారు. అత్యల్పంగా హిమాచల్ ప్రదేశ్‌లో కేవలం 14.8శాతం మంది పురుషులు మాత్రమే దీన్ని సమర్థించారు.
భర్త ఏ పరిస్థితుల్లో భార్యను కొడుతాడనే ప్రశ్న కూడా సర్వేలో (National Family Health Survey) అడిగారు. భర్త తన పట్ల విశ్వాసంగా ఉండ్లేదనా.. అత్త,మామలను సరిగా చూసుకోవట్లేదనా... తనతో తరచూ వాదనకు దిగుతోందనా... తనతో శృంగారానికి నిరాకరిస్తోందనా... తనకు చెప్పకుండానే ఇంటి నుంచి బయటకు వెళ్తోందనా... సరిగా వంట చేయట్లేదనా.. లేక ఇంటిని, పిల్లలను పట్టించుకోవట్లేదనా... అనే ప్రశ్నలను మహిళల ముందు ఉంచారు. చాలామంది మహిళలు 'ఇంటిని, పిల్లలను పట్టించుకోకపోవడం వల్లే భర్తలు భార్యలను కొడుతారని చెప్పారు. అలాగే అత్త,మామలను గౌరవించకపోయినా కొడుతారని పేర్కొన్నారు.
Also Read: Vari Deeksha: ముగిసిన కాంగ్రెస్ వరి దీక్ష- సీఎం కేసీఆర్‌పై నిప్పులు చేరిగిన నేతలు!
సమాజంలో లింగ సమానత్వం కోసం పనిచేస్తున్న Oxfam India సంస్థ ప్రతినిధి అమితా పిత్రే ఈ సర్వేపై (Survey) స్పందించారు. సామాజిక కట్టుబాట్లే మహిళలపై హింసాత్మక చర్యలను (Violence against Women) సైతం సమర్థించేలా చేస్తాయని పేర్కొన్నారు. పితృస్వామిక సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మహిళలే సాధనాలుగా ఉపయోగపడుతారని అన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి