హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని జన్వాడ వద్దనున్న (Farm House) ఫామ్ హౌజ్ నిర్మాణంపై కేటీఆర్ కు, తెలంగాణ ప్రభుత్వానికి (National Green Tribunal, NGT) జాతీయ హరిత ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది. జన్వాడలో 111 జీవోకు విరుద్ధంగా కేటీఆర్ విలాసవంతమైన ఫామ్ హౌజ్ నిర్మించారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు,మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.  Telangana: ఒక్క రోజే 127 కరోనా కేసులు.. ఆరుగురు మృతి )


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: TS SSC exams 2020: 10వ తరగతి పరీక్షలపై కొనసాగుతున్న సస్పెన్స్


కాగా రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్ పై తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి,(Pollution Control Board) హెచ్ఎండిఏ(Hyderabad Metropalitan Development Authority)కు జాతీయ హరిత ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది.  మరోవైపు ఫామ్ హౌజ్ నిర్మాణంపై కేంద్ర పర్యావరణ శాఖ నేతృత్వంలో కమిటీ వేసింది. టిఎస్ (TSPCB) పీసీబీ, (GHMC) జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, హెచ్ఎండిఏ(HMDA) అధికారులతో పాటు రంగారెడ్డి కలెక్టర్ కమిటీలో సభ్యులుగా చేర్చింది. 2018లో 111 GOను పూర్తిగా అమలు చేయాలంటూ సర్కార్ ఇచ్చిన తీర్పు అమలుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో 2 నెలల్లో నివేదిక సమర్పించాలని కమిటీ ఆదేశాలు జారీ చేసింది. అయితే తదుపరి విచారణ ఆగస్టు 26 కు వాయిదా వేసింది.   హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..