Niharika Konidela: రాత్రి నుంచి పోలీస్ స్టేషన్‌లోనే నిహారిక కొణిదెల?.. కౌన్సెలింగ్ అనంతరం..!
Niharika Konidela caught in Banjara Hills pub Ride. బంజారాహిల్స్‌లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో దాడి జరిగిన సమయంలో ఆ పబ్‌లో మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల కూడా ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం నిహారిక పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లినట్టు తెలుస్తోంది.
Niharika Konidela in Police Custody after caught at Banjara Hills Pub raids: బంజారాహిల్స్‌లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో ఆదివారం తెల్లవారుజామున టాస్క్‌ఫోర్స్ పోలీసులు చేసిన దాడులు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనం రేపింది. ర్యాడిసన్ బ్లూ హోటల్‌లో నిర్వహిస్తున్న ఫుడింగ్ మింక్ పబ్‌లో ఈ రోజు తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో యువతీ యువకులు డ్రగ్స్ సేవిస్తూ మత్తులో చిందులేస్తున్నట్లు సమాచారం రావడంతో.. టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెంటనే అప్రమత్తమై మెరుపు దాడులు చేశారు. ఈ దాడులలో 150 మంది యువతీ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో బడాబాబుల పిల్లలు కూడా ఉన్నారు.
టాస్క్‌ఫోర్స్ పోలీసులు వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న చాలామంది అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం తీశారు. కొందరు కిటికీ, బాత్రూమ్‌లలో డ్రగ్స్ ప్యాకెట్లను పడేశారు. ఈ మెరుపు దాడిలో పోలీసులు ఆరు గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు మరికొంతమంది దగ్గర రెడ్ హ్యాండెడ్‌గా డ్రగ్స్ ప్యాకెట్లను దొరకబట్టారు. దాడిలో అదుపులోకి తీసుకున్న వారందరినీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించారు. నిబంధనలకు విరుద్ధంగా తెల్లవారుజామున 3 గంటల వరకు పబ్ నిర్వహించిన యజమానిని సైతం అదుపులోకి తీసుకున్నారు.
విచారణ అనంతరం కొందరిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు విడుదల చేయగా.. మరికొందరు మాత్రం స్టేషన్‌లోనే ఉన్నారు. ఇక రాత్రి దాడి జరిగిన సమయంలో ఆ పబ్‌లో మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల కూడా ఉన్నారు. రాత్రే అందరితో పాటుగా నిహారికను కూడా పోలీస్ స్టేషన్‌కు తరలించారట. అప్పటి నుంచి మెగా డాటర్ అక్కడే ఉన్నట్టు సమాచారం తెలుస్తోంది. తలిదండ్రులని పిలిపించి, కౌన్సెలింగ్ ఇచ్చిన అనంతరం కొందరిని విడుదల చేశారట. ఈరోజు మధ్యాహ్నం నిహారిక పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లినట్టు తెలుస్తోంది.
Also Read: Sai Pallavi Farming: కూలీగా మారిన 'శ్యామ్ సింగరాయ్' మూవీ హీరోయిన్ - ఫొటోలు వైరల్!
Also Read: Maxwell Join RCB: ఆర్సీబీ శిబిరంలో చేరిన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook