Nizamabad MP Dharmapuri Arvind News: కాంగ్రెస్ రైతులను నమ్మించి మోసం చేసిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేశ్వర్ రెడ్డి ఎల్పీ నేత అయినప్పటి నుంచి ఎన్నో స్కాములు, అవినీతిని బట్టబయలు చేశాడని అన్నారు. కాంగ్రెస్‌కు హైదరాబాద్‌లో సీట్లు రాలేదని.. వాళ్లకు గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లు వచ్చాయని.. అందుకే ఇక్కడ పేదల ఇండ్లు కూలుస్తోందని ఫైర్ అయ్యారు. 9 ఏళ్లు తెలంగాణలో ప్రజా కంటగింపు పాలనను చూశామని.. కేసీఆర్ రెండోసారి అధికారంలోకి రాగానే రాచరిక పాలన సాగించారని అన్నారు. ఆయనపై మాట్లాడితే కార్లు, ఇండ్లపై దాడులు జరిగాయని.. అందుకే ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టి గద్దె దింపారని ఎద్దేవా చేశారు. అయితే కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే.. ఇస్తే నోటీస్ లేకుండా నేరుగా కూలుస్తున్నారని మండిపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Viral video: టమాటాలను తింటున్నారా..?.. బీ అలర్ట్..  ఈ పాము ఎంత కసితీరా కాటేస్తుందో చూడండి.. వీడియో వైరల్..


"ముస్లింలకు ఒకలా హిందువులకు ఒకలా చూస్తున్నారు. హిందువుల ఇండ్లు మాత్రమే కూలుస్తున్నారు. రైతు రుణమాఫీ చేయలేదు. రైతు భరోసా లేదు, బోనస్ ముచ్చట లేదు. ప్రమాదవశాత్తు పంట నష్టం జరిగితే ఆదుకునే నాథుడే లేడు. కేసీఆర్ ఒక ఎకరాకు కోటి సంపాదిస్తున్నాడట.. కోటి సంపాదన ఎలా సాధ్యమో తెలుసుకునేందుకు ఒక టీమ్ కూడా పంపాలి. స్టడీ కోసం రేవంత్ టీమ్ ఏర్పాటు చేయాలి. రైతులకు గైడ్ చేయాలి. ఇది రేవంత్ కు నా పర్సనల్ రిక్వెస్ట్.


కేసీఆర్ దిగిపోయాక ఆయన మాటలను చాలా మిస్ అవుతున్నా.. ఉద్యమ సమయంలో ఆయన పులిలా ఉన్నారు. ఇప్పుడు పిల్లి లాగా అయ్యారు. కేసీఆర్ తెలంగాణను నట్టేట ముంచారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే దారిలో పోతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు అగ్రికల్చర్ పాలసీ కూడా లేదు. కేటీఆర్‌కు అల్లం, పసుపు ఇచ్చి ఏది ఏంటో చెప్పమనండి. ఆయన ఇవాళ మాట్లాడుతున్నాడు. కేసీఆర్ తెలంగాణ పిత కావల్సింది.. ఇద్దరు పిల్లలకు పితగానే మిగిలాడు. పులికి పుట్టిన ఇద్దరు పిల్లలు అవినీతి చేసి జైలుకు పోతున్నారు. బెయిల్‌పై వస్తున్నారు.


కేసీఆర్ లాగే వరి మాత్రమే వేసుకునే పరిస్థితిని కాంగ్రెస్ తీసుకొచ్చింది. రైతు భరోసా కాదు బీమా కూడా అందట్లేదు. చనిపోయిన ఇందిరమ్మను కూడా ప్రశాంతంగా ఉండనివ్వకుండా ఇంకా బదనాం చేశారు. ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు. ఇది చూసి నాకు కూడా వాళ్లకు ఓటేయాలని అనిపించింది. రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటే కేసీఆర్ కు పట్టిన గతే రేవంత్‌కు పట్టుద్ది రైతులను ఆదుకోండి. కేసీఆర్ పోరగాళ్లకు (పిల్లలకు) కుక్క కూడా ఓటు వేయదు. మనమంతా ఇలాగే కలిసి కట్టుగా బలమైన అపొజిషన్‌గా వెళ్తే వచ్చే ఎన్నికల్లో అధికారం మనదే.." అని ధర్మపురి అర్వింద్ అన్నారు.


Also Read: EPFO News: ఉద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. EPFO క్లెయిమ్స్‌ విషయంలో కీలక అప్‌డేట్..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.