హైదరాబాద్: నిన్న తెరాసకు చెందిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి నేడు నిజామాబాదు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వరుసగా ప్రజాప్రతినిధులను కరోనా మహమ్మారి వెంటాడుతోంది. తెలంగాణలో కరోనా రక్కసి తీవ్ర స్థాయిలో ప్రబలుతోంది. తాజాగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ స్వల్ప అస్వస్థతకు గురవడంతో కరోనా పరీక్షలు నిర్వహించారు. కాగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చికిత్స కోసం హైదరాబాద్ బయల్దేరారు.  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: వైరల్‌గా మారిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి INSTAGRAM POST


ఇదిలాఉండగా ఎమ్మెల్యేకి కరోనా నిర్ధారణ కావడంతో ఆయన కుటుంబసభ్యులకు పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, తెలంగాణలో కరోనా సోకిన రెండో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. గత రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో ఆరోగ్య శాఖ యంత్రాంగం అప్రమత్తమైంది. హైదరాబాద్ నగరంలోనూ GHMC పరిధిలో కంటైన్మెంట్ జోన్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. జిల్లా స్థాయిల్లో కేసుల పెరుగుదల సైతం ఆందోళన కనబరుస్తోన్న నేపథ్యంలో ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. కరోనా పరీక్ష కేంద్రాలు పెంచాలని, సీఎం ప్రకటించిన 1000 కోట్ల కరోనా నిదులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..