Free Entry: హైదరాబాద్‌వాసులకు గుడ్‌న్యూస్..ఇకపై చార్మినార్, గోల్కొండ కోటలో ఫ్రీ ఎంట్రీ..!
Free Entry: దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈక్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Free Entry: హైదరాబాద్‌వాసులకు మోదీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇవాళ్టి నుంచి 15 వరకు చార్మినార్, గోల్కొండ కోటలో ఎలాంటి ప్రవేశ రుసుము ఉండదు. ఈ విషయాన్ని అధికారులు తెలిపారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా కేంద్రం ఈనిర్ణయం తీసుకుంది. చార్మినార్, గోల్కొండ కోటలో భారత పురావస్తు శాఖ నేతృత్వంలో ఉన్న అన్ని స్మారక చిహ్నాలు, ప్రదేశాలకు సందర్శకులకు ఉచితంగా ప్రవేశం ఉంటుంది.
ఈ విషయాన్ని భారత పురావస్తు శాఖ అధికారులు అధికారికంగా వెల్లడించారు. ఆగస్టు 5 నుంచి 15 వరకు ఉచిత ప్రవేశం ఉండనుంది. భారతీయులతోపాటు విదేశీయులకు దీనిని సద్వినియోగం చేసుకోవచ్చు. భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలోని సుమారు 3 వేల 400 ప్రాంతాల్లో ఫ్రీ ఎంట్రీ ఉండనుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ట్వీట్ చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
తెలంగాణలో పలు చారిత్రాత్మక ప్రాంతాలు ఉన్నాయి. హైదరాబాద్, వరంగల్ జిల్లాల్లో నాలుగు స్మారక చిహ్నాలు ఉన్నాయి. వీటిలో నేటి నుంచి 15 వరకు ఉచిత ప్రవేశం ఉంటుంది. ఆగస్టు 15 తర్వాత యధావిధిగా ప్రవేశ రుసుము ఉంటుంది. తెలంగాణలో చార్మినార్, గోల్కొండ కోట, వేయి స్తంభాల గుడి, వరంగల్ కోట, పిల్లల మర్రి, రామప్ప ఆలయంలో 15 వరకు ఉచిత ప్రవేశం ఉంటుందని అధికారులు ఓ ప్రకటనలో వివరించారు.
Also read:TS Govt: సిజేరియన్లు తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..!
Also read:Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో రుతుపవన ద్రోణి ఎఫెక్ట్..రాగల మూడు రోజులపాటు రెయిన్ అలర్ట్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook