హైదరాబాద్: నగరంలో జరగుతున్న ఆర్మీ సెలక్షన్ జాతరను తలపిస్తున్నాయి. ఒక్క ఉద్యోగం కోసం వందల మంది పోటీ పడుతున్న నేపథ్యంలో వేలాది మంది అధ్యర్ధులు తరలివచ్చారు. మూడు రోజుల పాటు జరిగే సెలక్షన్స్ కు దేశ నలుమూలల నుంచి దాదాపు 15 వేల మంది అభ్యర్ధులు పాల్గొన్నట్లు తెలిసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సెలక్షన్ కోసం వచ్చిన అభ్యర్ధులకు కనీస వసతులు కరవయ్యాయి.దీంతో సెలక్షన్ కోసం వచ్చిన అభ్యర్ధులు తెగ ఇబ్బందులు పడుతన్నారు. నిద్రించేందుకు లాడ్జింగ్ లో పనిచేసే స్థోమత లేకపోవడంతో ఎముకలు కొరికే చలిలో జాబ్ లో కోసం జాగరణ చేస్తున్నారు.


అధికారుల తీరుపై అభ్యర్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి కోసం ఊళ్లను వదిలి వచ్చిన తమకు కనీస ఏర్పట్లతో కూడా చేయలేదని వాపోతున్నారు. కనీస సదుపాయాలు కల్పించకపోవడం దారమణని ఆరోపిస్తున్నారు.  నిద్రపోయేందుకు ఏర్పట్లుక కూడా చేయలేదని..కనీసంమంచినీటి అవసారాలు కూడా తీర్చడం లేదని అభ్యర్ధులు వాపోతున్నారు.