Uma Maheshwari Last Rites: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఉమామహేశ్వరి భౌతిక కాయానికి హిందూ సాంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. నటుడు, ఉమామహేశ్వరి సోదరుడు నందమూరి బాలకృష్ణ పాడె మోశారు. ఉమామహేశ్వరి భర్త కంఠమనేని శ్రీనివాస ప్రసాద్ ఆమె చితికి నిప్పంటించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అంత్యక్రియలకు హాజరయ్యారు. అంతకుముందు, జూబ్లీహిల్స్‌లోని ఉమామహేశ్వరి నివాసం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర నిర్వహించారు. ఉమామహేశ్వరికి కడసారి వీడ్కోలు పలికేందుకు నందమూరి కుటుంబ సభ్యులు తరలివచ్చారు.


కాగా, ఎన్టీఆర్ కుమార్తెల్లో చిన్న కుమార్తె అయిన ఉమామహేశ్వరి రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఉమామహేశ్వరి మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నారు. ఉమామహేశ్వరి పెద్ద కుమార్తె అమెరికాలో ఉంటున్న నేపథ్యంలో ఆమె వచ్చాకే అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. బుధవారం (ఆగస్టు 3) ఉదయం ఆమె హైదరాబాద్ చేరుకోవడంతో అంత్యక్రియలు నిర్వహించారు. ఉమామహేశ్వరి ఆత్మహత్యపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 



 




Also Read: AP 10th Supplementary Results: పది సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..రిజల్ట్స్‌ ఇలా చెక్ చేసుకోండి..!  


Also Read: Mulugu Lawyer Murder: న్యాయవాది మల్లారెడ్డి హత్య వెనక సుపారీ గ్యాంగ్... మూడు రోజుల రెక్కీ తర్వాత మర్డర్..