Omicron Cases in Telangana: తెలంగాణలో ఒమిక్రాన్(Omicron) కలకలం రేపుతోంది. రాష్ట్రంలో మరో ఒమిక్రాన్ కేసు బయటపడింది. హనుమకొండకు చెందిన మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధరణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య(Omicron Cases in Telangana) 8కు చేరింది. ఒమిక్రాన్ వేరియంట్ పట్ల భయాందోళన చెందవద్దని  డీహెచ్ శ్రీనివాసరావు అన్నారు. ఇప్పటి వరకు దేశంలో 80 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 శంషాబాద్‌ విమానాశ్రయంలో సేకరించిన నమూనాల్లో 9 మందికి ఒమిక్రాన్‌ పాజిటివ్ గా తేలిందని...వీరిలో 8 మంది రాష్ట్రంలో ప్రవేశించారని డీహెచ్ చెప్పారు. మరొక వ్యక్తి పశ్చిమ్‌ బెంగాల్‌కు చెందిన వారన్నారు. ఆయన రాష్ట్రంలోకి ప్రవేశించలేదని డీహెచ్‌ తెలిపారు. ఇప్పటివరకు సామూహిక వ్యాప్తి జరగలేదని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. నాన్‌ రిస్క్‌ దేశాల(Non-risk Countries) నుంచి వచ్చిన ఏడుగురితో పాటు హన్మకొండకు చెందిన మహిళకు ఒమిక్రాన్‌ సోకినట్లు ఆయన వెల్లడించారు.


Also Read: Telangana Omicron Cases : తెలంగాణలో విజృంభిస్తోన్న ఒమిక్రాన్.. 7 కు చేరిన కేసులు.. తస్మాత్‌ జాగ్రత్త


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook