One State One Card: పదేళ్లలో రేషన్‌ కార్డులు ఇవ్వకపోవడంతో ఇప్పుడు ఒక్క కార్డుతో 30 రకాల సేవలు అందించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఒక్క కార్డుతో అన్ని రకాల సేవలు ప్రజలకు అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ క్రమంలోనే కుటుంబ గుర్తింపు, కుటుంబ డిజిటల్​ కార్డు పైలెట్ ప్రాజెక్ట్ చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకే ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అందిస్తున్నట్లు వివరించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Konda Surekha: క్షమాపణలు చెప్పని కొండా సురేఖ.. కానీ 'ఆ కామెంట్లు' వెనక్కి తీసుకున్న మంత్రి


 


కుటుంబ గుర్తింపు, కుటుంబ డిజిటల్​ కార్డు పైలెట్ ప్రాజెక్ట్ కార్యక్రమాన్ని గురువారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. '119 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా 'ఒక రాష్ట్రం-ఒక కార్డు' చేపడుతున్నాం. 'రేషన్ కార్డు కావాలని ప్రజలు పదేళ్లు చెప్పులరిగేలా తిరిగినా ఆనాటి ప్రభుత్వం స్పందించలేదు. ప్రతీ పేద వాడికి రేషన్ కార్డు అందించాలని మా ప్రభుత్వం  సంకల్పించింది. అందుకే ఇతర రాష్ట్రాల్లోని విధానాలను అధ్యయనం చేసి ఒక కొత్త విధానాన్ని తీసుకొస్తున్నాం' అని వివరించారు.

Also Read: Konda Surekha: నోటి దూల ఎఫెక్ట్‌.. కొండా సురేఖ మంత్రి పదవికి రాజీనామా?


 


'సంక్షేమ పథకాల అమలు విషయంలో వివిధ శాఖల సమాచారమంతా ఒకే కార్డులో పొందుపరుస్తాం. 30 శాఖల సమాచారం ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ఒక్క క్లిక్‌తో అందుబాటులోకి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఒక రాష్ట్రం ఒక కార్డుతో ప్రభుత్వం ముందుకెళుతోంది. అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందించేందకే ఈ విధానం. మీ కుటుంబాలకు ఒక రక్షణ కవచంలా ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఉంటుంది' అని రేవంత్‌ రెడ్డి తెలిపారు.


'అన్ని సంక్షేమ పథకాలు ఒకే కార్డు ద్వారా అందించనున్నాం. రేషన్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, ఇతర సంక్షేమ పథకాలన్నింటికీ ఈ కార్డు ఉపయోగపడుతుంది. ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ప్రతీ ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ కూడా పొందుపరుస్తాం. పేదలను ఆదుకునేందుకే ఫ్యామిలీ డిజిటల్ కార్డు. అమలులో సమస్యలు గుర్తించేందుకు ఇవాళ పైలట్ ప్రాజెక్టును చేపడుతున్నాం. పైలట్ ప్రాజెక్ట్‌లో వచ్చే సమస్యల ఆధారంగా పరిష్కారాలతో ముందుకెళతాం' అని ముఖ్యమంత్రి వివరించారు.


'హైదరాబాద్ నగరాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే హైడ్రా, మూసీ ప్రాజెక్టును తీసుకొస్తున్నాం. కిరాయి మనుషులతో మీరు చేసే హడావుడి తెలంగాణ సమాజం గమనిస్తోంది. ప్రత్యామ్నాయం ఏం చేయాలో చెప్పండి ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. హైడ్రాపై అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదు. మూసీ మురికిలో బ్రతుకుతున్న పేదలకు ఇళ్లు ఇచ్చి, రూ.25 వేలు ఇచ్చి వారి ఆత్మగౌరవాన్ని పెంచుతున్నాం' అని రేవంత్‌ రెడ్డి తెలిపారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి