Jeevan Reddy Row: తెలంగాణలో ఒరిజినల్‌ కాంగ్రెస్‌ నాయకులు ఒక్కటవుతున్నారని తెలుస్తోంది. జగిత్యాల పరిణామాలు నిఖార్సైన కాంగ్రెస్‌ పార్టీ నాయకులను తీవ్రంగా కలచివేస్తున్నాయి. జీవన్‌ రెడ్డికి జరుగుతున్న అవమానాలు, చిన్నచూపుతనం మిగతా ప్రాంతాల్లోనూ ఎదురవుతుందనే వాస్తవాన్ని గుర్తించి పార్టీకి నమ్మిన బంటులంతా ఒక్కటవుతున్నారని సమాచారం. తాజాగా జీవన్‌ రెడ్డికి.. ఆయన చేసిన వ్యాఖ్యలకు పార్టీ సీనియర్‌ నాయకుడు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాశ్‌ రెడ్డి అలియాస్‌ జగ్గారెడ్డి మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఓ కీలక ప్రకటన చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: KTR: రోడ్డు ప్రమాదం చూసి చలించిపోయిన కేటీఆర్.. స్వయంగా రంగంలోకి దిగి


 


'జీవన్ రెడ్డి ఆవేదన చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. ఏం జరుగుతుందో నాకు అర్ధం కావడం లేదు. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఏమి అర్ధం కాక.. ఏమి మాట్లాడలేక పోతున్నా' అని జగ్గారెడ్డి తెలిపారు. 'జీవన్ రెడ్డిని మీడియాలో చూసిన తర్వాత ఈ వయసులో ఆయనకు ఈ ఆవేదన ఏంటి అని మనసు కలుక్కుమన్నది' అని పేర్కొన్నారు. జీవన్ రెడ్డికి ఈ మాత్రమైనా జగ్గారెడ్డి అండగా ఉన్నాడు అని చెప్పడానికి తాను మాట్లాడుతున్నట్లు వివరించారు. నా మనసులో మాట ఇదే అంటూ మాట్లాడారు.


Also Read: Singareni: సింగరేణి ఉద్యోగులకు జాక్‌పాట్‌.. ఒక్కొక్కరికి రూ.93,750 దీపావళి బోనస్‌


'నేను ఎవరిని తప్పుపట్టడం లేదు. కానీ జీవన్ రెడ్డి తాను ఒంటరి అని ఎప్పుడూ భావించవద్దు. సమయం వచ్చినప్పుడు జీవన్ రెడ్డి వెంట నేను ఉంటా. ఆయన కాంగ్రెస్‌వాది. జీవన్ రెడ్డి జీవితం మొత్తం కష్టాలే. ఎప్పుడు జనంలో ఉండే ఆయనను జగిత్యాల ప్రజలు ఎందుకు ఓడించారో అర్థం కానీ పరిస్థితి' అని జగ్గారెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. ఇక తనను సంగారెడ్డిలో ప్రజలు ఓడించడంపై కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 'సంగారెడ్డిని ఎంతో అభివృద్ధి చేసిన నన్ను ఎందుకు ఓడగొట్టారో అర్థం కాలేదు' అని పేర్కొన్నారు.


 


'కాంగ్రెస్‌ పార్టీని.. ప్రజలను కానీ తప్పుపట్టడం లేదు. మా సమయం బాగోలేదు కాబట్టి ఎవరేం చేస్తారు అని సర్డుకుపోతున్న. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వయసుకు నా వయసుకి తేడా ఉంది. ఈ వయసులో ఆయనకు ఇలాంటి రాజకీయ ఇబ్బందులు రావడం బాధాకరంగా అనిపించింది' అని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 'ఈ వివాదాన్ని అధిష్టానం వెంటనే గుర్తించి జీవన్ రెడ్డి సమస్యకు పరిష్కారం చూపాలి' అని విజ్ఞప్తి చేశారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook