OU CI Rajender Overaction: నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్‌కు మద్దతుగా నిలుస్తున్న జీ తెలుగు న్యూస్‌పై దాడి చేయడమే కాకుండా వివరణ కోరడంపై కూడా పోలీసులు రెచ్చిపోయారు. ఎందుకు అలా చేశారంటూ ఓయూ పోలీస్‌ స్టేషన్‌ సీఐ జితేందర్‌ను వివరణ అడిగారు. అయితే వివరణ ఇవ్వకుండా ఓవర్‌ యాక్షన్‌ చేశారు. 'మీకు పనీపాటా లేదా' అంటూ ఎదురుప్రశ్నించారు. పదే పదే జీ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా అతడు అసహనం వ్యక్తం చేశారు. ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Police Attack On Zee Telugu: జీ మీడియాపై పోలీస్ జులుం.. రిపోర్టర్‌ను గల్లా పట్టి ఈడ్చుకెళ్లిన పోలీసులు


 


ఏం జరిగిందంటే?
డీఎస్సీ పరీక్షల వాయిదాపై పోరాటం చేస్తున్న నిరుద్యోగుల కార్యక్రమాలను కవరేజ్‌ చేయడానికి ఓయూకు వెళ్లిన జీ తెలుగు చానల్‌ రిపోర్టర్‌ శ్రీచరణ్‌పై దాడికి పాల్పడ్డారు. చొక్కా పట్టుకుని లాక్కెళ్లి వాహనంలోకి పోలీసులు పడేశారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌ తీసుకెళ్లి మీడియా అని చెప్పినా వినలేదు. అనంతరం హబ్సిగూడ దాకా వాహనంలో ఐదు నిమిషాల పాటు అటు ఇటు తిప్పి తిరిగి వదిలేశారు.

Also Read: KTR Harsih Rao Condemns: జీ మీడియాపై పోలీస్ దాడిని ఖండించిన కేటీఆర్‌, హరీశ్‌ రావు.. రాజకీయ ప్రముఖులు


అయితే దాడికి పాల్పడిన ఓయూ సీఐ రాజేందర్‌ వివరణ కోరేందుకు జీ తెలుగు న్యూస్‌ ప్రతినిధి వెళ్లారు. 'మీకు పనీపాటా లేదా?' 'మీకు వేరే పనీపాటా లేదా' అని రెండు మూడు సార్లు అన్నాడు. అతడి స్పందనపై మీడియా ప్రతినిధి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి మరి ప్రశ్నించడంతో సీఐ రాజేందర్‌ను తోటి పోలీస్‌ అధికారులు పక్కకు తీసుకెళ్లారు. అరెస్ట్‌ సమయంలోనూ.. మీడియా వివరణ సమయంలోనే సీఐ రాజేందర్‌ అక్కసు వెళ్లగక్కారు. తీవ్ర అసహనంతో ఉన్నారు. అతడి తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తంమవుతోంది. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి