Padi Kaushik reddy warning to arekapudi Gandhi: తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీట్ గా మారాయి.  ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ  తన అనుచరులతో కలిసి, హుజురాబాద్  ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అరికెపూడి అనుచరులు.. పాడి కౌశిక్ రెడ్డి ఇంటిలోకి చొరపడేందుకుప్రయత్నించారు. అంతేకాకుండా.. పెద్ద  ఎత్తున నినాదాలు చేసుకుంటూ రెచ్చిపోయారు. కోడిగుడ్లు, రాళ్లతో పాడి కౌశిక్ ఇంటిపైన దాడికి దిగారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఇంటిలోని గేట్లు విరగ్గొట్టేందుకు సైతం ప్రయత్నించారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పాడి కౌశిక్ రెడ్డి ఇంటిగేటును ఎక్కేందుకు సైతం..  అరికెపూడి గాంధీ అనుచరులు ప్రయత్నించారు.  పోలీసులు ఎంత కంట్రోల్ చేసిన కూడ అక్కడ మాత్రం పరిస్థితులు ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం ఏర్పడేలా చేశాయి. ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై మాజీమంత్రి హరీష్ రావు సైతం స్పందించారు. తమ పార్టీకి చెందిన  ఎమ్మెల్యేలను చేర్చుకుని.. తమపైనే దాడులు చేయడం ఘోరమన్నారు.


సీఎం రేవంత్ ప్రొద్బలంతోనే .. ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని హరిష్ రావు అన్నారు. ఇదేం రాజ్యం, ఇదేం ప్రజాపాలన, ఇదేనా మీరు ప్రజలకు ఇస్తామన్న ఇందిరమ్మ రాజ్యమా అంటూ మండిపడ్డారు. మరోవైపు.. పోలీసులు  ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు భద్రత కల్పించాలన్నారు. ఇదే నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి తన ఇంటిపై జరిగిన దాడిపై స్పందించారు.


Read more: Arekapudi Gandhi: నీ బాంచెత్.. రారా తెల్చుకుందాం.. కౌశిక్ రెడ్డిపై రెచ్చిపోయిన అరికెపూడి గాంధీ.. వీడియో వైరల్..


దీనికి ప్రతిచర్య తప్పకుండా ఉంటుందున్నారు. రేపు తెలంగాణ తడాఖ ఏంటో చూపిస్తానని, అరికెపూడి గాంధీకి మాస్ వార్నింగ్ ఇచ్చారు. తనపై కాంగ్రెస్ నాయకులు.. ప్లాన్ ప్రకారమే దాడులు చేయిస్తున్నారని కౌశిక్ రెడ్డి అన్నారు. అరికెపూడి అనుచరులు దాడులు చేస్తుంటే.. పోలీసులు మాత్రం ..ఏదో చూద్యం చూస్తూ ఉండిపోయారని పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఇద్దరు  ఎమ్మెల్యేలు మధ్య రచ్చతో తెలంగాణలో మాత్రం ఒక్కసారిగా రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.