Palvancha Ramakrishna family suicide case update SP Sunil Dutt announces vanama raghava arrested: కొత్త‌గూడెం ఎమ్మెల్యే వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర రావు కుమారుడు వ‌న‌మా రాఘ‌వను పోలీసులు అరెస్ట్ చేశారు. ద‌ట్ట‌మైన అటవీ ఉండే ద‌మ్మ‌పేట ప‌రిస‌ర ప్రాంతాల్లో పోలీసులు వ‌న‌మా రాఘ‌వ‌ను (vanama raghava) పట్టుకున్నారు. వ‌న‌మా రాఘ‌వేంద్ర‌ ఒక వాహ‌నంలో రాజ‌మండ్రి పారిపోతున్న క్రమంలో పోలీసులు (Police) వెంబడించి ఆయన్ని అరెస్ట్ చేసినట్లు భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా (bhadradri kothagudem district) ఎస్పీ సునీల్ ద‌త్ వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పూర్తి స్థాయి విచార‌ణ చేపట్టాక కోర్టులో హాజ‌రు ప‌రుస్తామ‌ని ఎస్పీ సునీల్ ద‌త్ (SP Sunil Dutt) పేర్కొన్నారు. కాగా వ‌న‌మా రాఘ‌వ మూడు రోజులుగా పోలీసులకు దొరకకుండా ప‌రారీలో ఉన్న విషయం తెలిసిందే.


కొత్తగూడెం-భ‌ద్రాద్రి జిల్లా పాల్వంచ‌లో రామ‌కృష్ణ కుటుంబం ఆత్మ‌హ‌త్య కేసులో వ‌న‌మా రాఘ‌వ‌ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ ఘ‌ట‌న వెలుగులోకి వచ్చిన తర్వాత వ‌న‌మా రాఘ‌వ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.


ఇక పాల్వంచ‌లో రామ‌కృష్ణ కుటుంబం సూసైడ్‌ చేసుకోవడం సంచ‌ల‌నంగా మారిన విషయం తెలిసిందే. వ‌న‌మా రాఘ‌వేంద్ర (Vanama Raghavendra) పెట్టిన ఇబ్బందుల తాళలేకే తాను, తన కుటుంబం సూసైడ్‌ చేసుకుంటున్నామని చెప్తూ చనిపోయే ముందు రామకృష్ణ ఒక వీడియో రికార్డ్ చేశారు. అది బ‌య‌ట‌కు రావ‌డంతో దుమారం రేగింది. ఆ తర్వాత వ‌న‌మా రాఘ‌వను టీఆర్ఎస్.. (TRS) పార్టీ నుంచి స‌స్పెండ్ చేసిన విషయం తెలిసిందే. 


Also Read :Perni Nani invitation to RGV : వర్మకు పేర్ని నాని నుంచి ఆహ్వానం.. ఇద్దరి భేటీ అక్కడే!!


వ‌న‌మా రాఘ‌వేంద్ర‌ (Vanama Raghavendra) పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరిగాడు. అయితే అత‌ని ఫోన్, కారు మూవింగ్స్‌ను బట్టి పోలీసులు ట్రేస్ చేసి.. చివరకు పట్టుకుని అరెస్ట్ చేశారు.


Also Read : Pratapsingh Rane: అధికారంలో బీజేపీ.. కాంగ్రెస్ నేతకు శాస్వత కేబినెట్ హోదా!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook