తెలంగాణలో పతంజలి ఆహార శుద్ధి పరిశ్రమ ఏర్పాటు కానుందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సమావేశంలో బాబా రామ్ దేవ్, ఆచార్య బాలకృష, తెలంగాణ ఎంపీ కల్వకుంట్ల కవిత తదితరులు పాల్గొన్నారు. ఒప్పంద పత్రాలను ఇరువురు మార్చుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎక్కడ ఏర్పాటు కానుంది?


తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం లక్కంపల్లి సెజ్ లో పతంజలి ఫుడ్ పార్క్ ఏర్పాటు కానుంది. తెలంగాణ పసుపు ఉత్పత్తి సాగులో అగ్రగ్రామి స్థానంలో ఉన్నది కనుక ఆహార ఉత్పత్తి పరిశ్రమ ఏర్పాటు చేయాలని గతంలో ఎంపీ కవిత కోరారు. అందుకు పతంజలి సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక్కడ పసుపు, మిర్చి, సుగంధ ద్రవ్యాలు, తృణధాన్యాలు శుద్ధి చేసి దేశంలోని వివిధ పతంజలి యూనిట్లకు సరఫరా చేస్తారు.