Pawan Kalyan: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజును ఆయన ఫ్యాన్స్  ఏ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా పవన్ ఫ్యాన్స్ హంగామా కనిపిస్తోంది. జనసేనాని బర్త్ డే సందర్భంగా దశాబ్దాం క్రితం ఆయన నటించింది జల్సా సినిమాను మళ్లీ రిలీజ్ చేశారు. దీంతో జల్సా షోలో ధియేటర్ల దగ్గర పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. హైదరాబాద్ లోని ఓ థియోటర్ లో అర్ధరాత్రి పవన్ ఫ్యాన్స్ హంగామా చేశారు. దీంతో పోలీసులు ఎంటరై అక్కడి పరిస్థితిని సెట్ చేయాల్సి వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్రవారం పవన్ కల్యాణ్ బర్త్ డే కావడంతో కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని షాపూర్ నగర్ రంగా థియేటర్, చింతల్ ఏషియన్ షా థియేటర్ లో జల్సా సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు. సెకండ్ షోకు ఫ్యాన్స్ భారీగా వచ్చారు. థియోటర్ లో పవన్ నినాదాలతో హెరెత్తించారు. సినిమాలో పవన్ డైలాగులకు కేరింతలు కొట్టారు. పాటలకు థియోటర్ లో అభిమానులు స్టెప్పులు వేస్తూ హంగామా చేశారు.  పవన్ సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. కొందరు అభిమానులు ఏకంగా థియోటర్ స్క్రీన్ పైకి ఎక్కి తీన్మార్ స్టెప్పులు వేస్తూ  రచ్చ రచ్చ చేశారు. ఫ్యాన్స్ వీరంగంతో జల్సా సినిమా షోను కాసేపు నిలిపేశారు.


పరిస్థితి కంట్రోల్ కాకపోవడంతో థియోటర్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు పవన్ కల్యాణ్ అభిమానులు కూల్ చేసే ప్రయత్నం చేశారు. జీడిమెట్ల పోలీసులు థియేటర్ లోకి వెళ్లి మైక్‌లో సూచనలు చేస్తూ అభిమానులను శాంతింప చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. పోలీసుల యాక్షన్ లో ఫ్యాన్స్ కూల్ కావడంతో తిరిగి షోను ప్రదర్శించారు. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook