ఎట్టకేలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ గడ్డపై అడుగుపెట్టారు. చలోరే చలోరే చల్ పేరుతో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ యాత్రలో ప్రజా సమస్యల అధ్యయనం అధ్యయనం చేస్తారు. కాగా ఈ యాత్రలో ఎక్కువ మంది జనాలను కలిసందేందుకు పవన్ తన షెడ్యూల్ లో పెట్టుకున్నారు. మొత్తానికి ఈ పర్యటన కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కొనసాగనుంది. ప్రజా సమస్యల అధ్యయనం అజెండాగా యాత్ర చేపడుతున్న పవన్ ..ఎలాంటి సమస్యలను ప్రధాన అజెండాగా పెట్టుకుంటారనేదానిపై ఆసక్తి నెలకొంది. 


పవన్ కల్యాణ్ ప్రజాయాత్ర విశేషాలు ఒక్కసారి తెలుసుకుందాం..
* 22న ఉదయం 9 గం.కు హైదరాబాద్‌ జనసేన కార్యాలయం యాత్ర ప్రారంభం
* మధ్యాహ్నం 2 గంటలకు జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆలయ దర్శనం
* సాయంత్రం కరీంనగర్ పర్యటన, పార్టీ నేతలు, కార్తకర్తలతో ప్రత్యేక భేటీ
* 23న కరీంనగర్‌లో ఉదయం కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జనసేన కార్యకర్తలతో భేటీ.
* 24న ఉదయం కొత్తగూడెం నుంచి ఖమ్మంకు ర్యాలీ
* 24న మధ్యాహ్నం 3 గంటలకు  వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల కార్యకర్తలతో భేటీ .