Revanth Reddy: అటు రేవంత్ రెడ్డి.. ఇటు భట్టి విక్రమార్క.. పోటీపోటీ సమావేశాలతో టీకాంగ్రెస్ లో కాక
Revanth Reddy: ఆదివారం కాంగ్రెస్ లో రెండు పోటా పోటీ సమావేశాలు జరుగుతుండటం కాక రేపుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్ లో పీసీసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఆదివారమే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మరో సమావేశం ఏర్పాటు చేశారు.
Revanth Reddy: కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించాల్సిన పని లేదు.. వాళ్లకు వాళ్లే ఓడించుకుంటారనే టాక్ మొదటి నుంచి ఉంది. కాంగ్రెస్ లో వర్గ పోరు ఎక్కువగా ఉంటుంది. సీనియర్ నేతలు ఎవరివారే అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. అందుకే కాంగ్రెస్ విషయంలో జనానికి ఆ అభిప్రాయం ఉంది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. తెలంగాణ ఇచ్చినా అధికారం రాలేదనే కసితో ఉన్న కాంగ్రెస్ హైకమాండ్.. తెలంగాణలో అధికారం కోసం ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది. అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణపై స్పెషల్ ఫోకస్ చేశారు. మేనెలలో రెండు రోజులు పర్యటించిన రాహుల్... ఆగస్టు2న మరోసారి తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. అటు కేసీఆర్ సర్కార్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని భావిస్తున్న కాంగ్రెస్.. కొంచెం కష్టపడితే అధికారం ఖాయమని ధీమాలో ఉంది. అయితే రాష్ట్ర కాంగ్రెస్ నేతల తీరు మాత్రం మారడం లేదు. హైకమాండ్ ఎంతగా హెచ్చరిస్తున్నా వర్గపోరు మాత్రం వీడటం లేదు.
ఆదివారం కాంగ్రెస్ లో రెండు పోటా పోటీ సమావేశాలు జరుగుతుండటం కాక రేపుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్ లో పీసీసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మానిక్కం ఠాగూర్ ఈ సమావేశానికి హాజరుకానున్నారు. అయితే ఆదివారమే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మరో సమావేశం ఏర్పాటు చేశారు. లక్డీకపూల్ సెంట్రల్ కోర్ట్ హోటల్ ఆయన సీఏల్పీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశానికి జరిగే మీటింగ్ కు పీఏసీ సభ్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్ లు, సీనియర్ ఉపాధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులను ఆహ్వానించారు. సెంట్రల్ కోర్ట్ హోటల్ లో జరిగే భట్టి విక్రమార్క మీటింగ్ కు ప్రస్తుత ఎమ్మెల్యే లు, మాజీ మంత్రులు ,మాజీ ఎమ్మెల్యే లను ఆహ్వానించారు. పీసీసీ చీఫ్, సీఎల్పీ చీఫ్ పోటాపోటీ సమావేశాలతో తెలంగాణ కాంగ్రెస్ లో గందరగోళం నెలకొంది.
ఆగస్టు 2న సిరిసిల్లలో జరగనున్న రాహుల్ గాంధీ బహిరంగ సభ, రాహుల్ జోడోయాత్ర, భారీ వరదలు, సోనియాగాంధీకి ఈడీ నోటీసులు తదితర అంశాల పై చర్చించడానికే పీసీసీ చీఫ్ సమావేశం పెట్టారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. అటు సీఎల్పీ చీఫ్ కూడా ఈ అంశాలపై మాట్లాడానికే సమావేశం పెట్టారని అంటున్నారు. దీంతో ఒకే అంశంపై వేరువేరు సమావేశాలు ఎందుకన్న చర్చ పార్టీలో సాగుతోంది. సీనియర్ నేతలు ఆధిపత్య పోరుతో కేడర్ లో అయోమయం నెలకొంటోంది. కలిసి పనిచేస్తామని చెబుతూనే పోటాపోటీ సమావేశాలు ఎందుకుని ప్రశ్నిస్తున్నారు. పీసీసీ, సీఎల్పీ కలిపి ఒకే సమావేశం పెట్టుకుంటే సరిపోయేది కదా అని నిలదీస్తున్నారు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క పోటీపోటీ సమావేశాలతో తెలంగాణ కాంగ్రెస్ లో కాక రేపుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతల తీరు మారదనే అభిప్రాయం జనాల్లో వ్యక్తమవుతోంది.
Read also: Who is Jagdeep Dhankhar: ఎన్డిఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధంకర్.. ఇంతకీ ఎవరీ జగదీప్ ధంకర్ ?
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook