కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో  దాదాపు 45 రోజులుగా మద్యం విక్రయాలు  లేవు. దీంతో దేశవ్యాప్తంగా మందు  బాబులు మద్యం కోసం అల్లాడిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ మద్యం ప్రియుల పరిస్థితి అలాగే ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో  మద్యం షాపులు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో మద్యం ప్రియులు  కుప్పలు కుప్పలుగా కొనుగోలు చేసేందుకు వచ్చారు. రెండు రోజుల్లోనూ తీరు మారలేదు. మద్యం ధరలు పెంచినా.. ఏమాత్రం అమ్మకాల్లో తేడా కనిపించలేదు. పైగా  మళ్లీ వైన్ షాపులు  మూసివేస్తారోనని ఎక్కువగానే మద్యం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 


[[{"fid":"185238","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


మరోవైపు నేటి (బుధవారం)  నుంచి తెలంగాణలోనూ మద్యం షాపులు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది.  తెలంగాణలో పేదవారు తాగే మద్యంపై 11 శాతం, ధనికులు తాగే మద్యంపై 16 శాతం  ధరలను పెంచారు. ఇవాళ్టి నుంచి వైన్ షాపులు తెరవడంతో.. తెలంగాణ అంతటా అన్ని షాపుల వద్ద భారీ  భారీ క్యూలు కనిపిస్తున్నాయి. తెల్లవారుజాము నుంచే మద్యం షాపుల ఎదుట మందు ప్రియులు వచ్చి క్యూ కట్టారు. షాపులు తెరవక ముందే వచ్చి క్యూలో నిలబడడం కనిపించింది. 


[[{"fid":"185239","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన విధంగా తెలంగాణలో జరగకుండా ఉండేందుకు ఎక్కువ సంఖ్యలో పోలీసులను నియమించారు. మద్యం కొనుగోలుదారులు సామాజిక దూరం పాటించేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఐతే పెద్ద పెద్ద క్యూలు ఉండడంతో మద్యం ప్రియులు ఎక్కువసేపు లైన్లలో నిలబడడం లేదు. మరోవైపు ఎండ వేడిమి విపరీతంగా ఉంది. దీంతో క్యూలలోని చెప్పులు, సంచులు, అట్టముక్కలు పెట్టడం  కనిపించింది.


[[{"fid":"185240","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..